Wanted PanduGod Movie Review : సినిమా పేరు : వాంటెడ్ పండుగాడ్
నటీనటులు : సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, విష్ణుప్రియ, సునీల్, అనసూయ, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, పుష్ప జగదీశ్, నిత్యా శెట్టి, వాసంతి, తనికెళ్ల భరణి, తదితరులు
నిర్మాతలు : సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి
మ్యూజిక్ డైరెక్టర్ : పీఆర్
డైరెక్టర్ : శ్రీధర్ సీపాన
సినిమాటోగ్రఫీ : మహిరెడ్డి పండుగల
విడుదల తేదీ : 19 ఆగస్టు 2022
బుల్లితెర స్టార్స్ అంతా ఒక్కటై నటించిన సినిమా ఇది. బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, విష్ణుప్రియ, అనసూయ లాంటి వాళ్లు నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అంతా ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాలో కావాల్సింత వినోదం ఉందని అర్థం అవుతోంది. ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు శ్రీధర్ తెరకెక్కించాడు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించారు. మరి.. ఇంత మంది భారీ నటీనటులు నటించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుందా తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Wanted PanduGod Movie Review : కథ
ఈ సినిమాలో సునీల్ ది కీలక పాత్ర. ఈ సినిమాలో సునీల్ పేరు పండు. ఇతడు జైలు నుంచి పారిపోతాడు. ఇతడిని పట్టుకోవడం కోసం పోలీసులు కోటి రూపాయల రివార్డు ప్రకటిస్తారు. ఈ విషయం తెలుసుకున్న పాండు సు(సుధీర్), డీ(దీపికా పిల్లి) ఇద్దరూ అతడిని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. వీళ్లిద్దరూ రిపోర్టర్లు. పండును పట్టుకోవడం కోసం వీళ్లతో పాటు మరికొందరు కూడా జత అవుతారు. వీళ్లంతా కలిసి పండును పట్టుకునే క్రమంలో ఎటువంటి అడ్డంకులను ఎదుర్కుంటారు. చివరకు పండును పట్టుకొని కోటి రూపాయల రివార్డు కొట్టేస్తారా? అసలు ట్విస్ట్ ఏంటి? ఇంతకీ పండును పట్టుకొని కోటి రూపాయల రివార్డు గెలుచుకున్నది ఎవరు అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.
సినిమా ఎలా ఉంది?
సాధారణంగా జబర్దస్త్ లాంటి కామెడీ షోలో నాన్ సింక్ కామెడీ నడుస్తుంది. కన్ప్యూజన్ డ్రామాను కూడా అక్కడ పండించవచ్చు. కానీ.. వెండి తెర మీద అలా చేయడం కుదరదు. అక్కడ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే కథ ఉండాలి. కామెడీ కూడా క్లీన్ గా ఉండాలి. కన్ఫ్యూజ్ చేయకూడదు. కానీ.. వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా జబర్దస్త్ స్కిట్లకు కొంచెం ఎక్స్ టెన్షన్ అన్నట్టుగా ఉంటుంది. అది ఒక సినిమా అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలగదు. ఒక కామెడీ స్కిట్ చూస్తున్నట్టుగానే ఉంటుంది. కాకపోతే సినిమా మొత్తం కామెడీ ఉండటం వల్ల థియేటర్ లో కాసేపు నవ్వుకోవచ్చు.
స్కిట్స్ అంటే ఇష్టం ఉండేవాళ్లు.. ఆ తరహా కామెడీని ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా సూపర్ డూపర్ గా నచ్చుతుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు అదరగొట్టేశారు. పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చివరకు రొటీన్ కామెడీ డ్రామాగా వాంటెడ్ పండుగాడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
యువతరం రేటింగ్ : 3.25/5