India vs Australia : టీం ఇండియా సరికొత్త రికార్డు…..అన్ని ఫార్మేట్స్ లో మనదే పై చేయి…..

India vs Australia  : ఇటీవల జరిగిన ఆసియా కప్ లో భారీ విషయాలను నమోదు చేసుకుని 8వ సారి ఆసియా కప్ ను దక్కించుకున్న టీమిండియా… ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో 3 వన్డే మ్యాచ్లో ఆడుతుంది. ఇక దీనిలో భాగంగా నిన్న ఇండియా మరియు ఆస్ట్రేలియా కు మధ్య జరిగిన పోరులో టీమిండియా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. అది కాక టీమిండియా దిగ్గజ ప్లేయర్స్ అయినా రోహిత్ శర్మ , కోహ్లీ , హార్దిక్ పాండ్యా వంటి వారు లేకుండానే ఒక జూనియర్ టీమ్ గా బరిలోకి దిగిన ఇండియా ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ టీం గా పిలవబడే ఆస్ట్రేలియా ను మట్టి కరిపించింది. స్టార్ ప్లేయర్స్ లేకుండా జూనియర్ టీం ఈ ఘనత సాధించడం మామూలు విషయం కాదు.

Advertisement

india-create-history-only-the-second-team-to-achieve-this-feat-in-mens-cricket

Advertisement

కేఎల్ రాహుల్ సారధ్యంలో కొనసాగిన టీమిండియా ఆస్ట్రేలియాకు గట్టి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక మన ఫేస్ బౌలర్ షమీ కేవలం 51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక మన బ్యాట్మెంట్స్ అందరూ అద్భుతంగా రాణించి ఇంకో 8 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా కు విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్ లో బ్యాట్ మెన్స్ శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్య కుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో టీమిండియా కు ఈ మ్యాచ్ గెలవడం సునాయాసం అయింది. దీంతో ప్రస్తుతం టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో 116 పాయింట్స్ సాధించి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.

india-create-history-only-the-second-team-to-achieve-this-feat-in-mens-cricket

ఇక మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 115 పాయింట్లు తో రెండో స్థానంలోకి వెళ్ళింది. అయితే ప్రస్తుతం టీమిండియా మూడు ఫార్మేట్ లలలో నెంబర్ వన్ గా కనిపిస్తుంది. అంతేకాక రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ఘనతత అందుకోవడం గ్రేట్ అని చెబుతున్నారు. క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటి ఘనత అందుకున్న రెండవ టీం గా టీమిండియా నిలిచింది. అయితే 2012లో సౌత్ ఆఫ్రికా మూడు ఫార్మేట్ లలో ఒకేసారి నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకున్న మొదటి టీమ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే ఇలాంటి చరిత్రాత్మక ఘనతను సాధించడంతో ఇండియన్ ప్లేయర్స్ లో ఇది సరికొత్త ఉత్సాహం నింపుతుందని చెప్పాలి.

Advertisement