Chandrayaan 3 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని యొక్క దక్షిణ ద్రవం పై మొట్ట మొదటి గా అడుగు పెట్టిన ల్యాండర్ విక్రమ్ ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తిని మరో అడుగు పెంచింది. ఇక ప్రజ్ఞాన్ రోవర్ సాయంతో చంద్రుని దక్షిణ ధ్రువం పై పరిశోధనలు జరిపి విలువైన సమాచారాన్ని భూమికి చేరవేశాయి. అయితే ప్రస్తుతం చంద్రునిపై రాత్రి వేళ అవడంతో ఇస్రో టీమ్ లాండర్ ను మరియు రోవర్ ను స్లీప్ మోడ్లోకి పంపించారు.
అయితే చంద్రునిపై రాత్రి సమయంలో విపరీతమైన చలి ఉంటుంది. మరి అలాంటి చల్లని రాత్రుల లో నిద్రిస్తున్నప్పుడు ల్యాండర్ ఎలా ఉంటుందో ఊహించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించారు మన ఇస్రో సైంటిస్టులు. ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజులు సమయం పడుతుంది. ఈ క్రమంలో 14 రోజులు సూర్యుని వెలుగులో మరో 14 రోజులు చీకట్లో ఉంటాడు చంద్రుడు. అంటే చంద్రునిపై ఒక రాత్రి సమయం భూమి మీద 14 రోజులు అన్నమాట.
ఇక ఈ 14 రోజుల రాత్రి సమయంలో చంద్రుని దక్షిణ ధ్రువం పై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీస్ గా ఉంటుంది. గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని ల్యాండర్ రోవర్ తట్టుకోగలవా అన్నది ప్రశ్న. అయితే సెప్టెంబర్ 22న చంద్రుని పై తిరిగి పగల సమయం రానుంది. ఇక అన్ని సవ్యంగా జరిగినట్లయితే విక్రమ్ లాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి పరిశోధనలు చేస్తాయి. సూర్యుని వెలుగు పడినప్పుడు వాటికి అమర్చిన ప్లేట్స్ సూర్యరశ్మిని ఆకర్షించి బ్యాటరీని రీఛార్జ్ చేసుకుంటాయి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగితే విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కొంటాయి. లేనట్లయితే దీర్ఘకాలిక నిద్రలోకి జారినట్లే..