చాలామందికి విదేశాలకు వెళ్లాలని ఆశ ఉంటుంది కాదు విదేశాలకు వెళ్లడం అంటే విమానంలో వెళ్లాల్సిందే అని అంతా అనుకుంటారు. కానీ మనదేశంలో విదేశాలకు వెళ్లడానికి 7 రైలు మార్గాలు ఉన్నాయి. ఈ విషయంపై ఎవరికి అంతగా అవగాహన లేదు. అందుకే విదేశాలు వెళ్లాలంటే ఫ్లైట్ ఎక్కాల్సిందే అని అనుకుంటారు. మన భారత దేశంలో రైళ్లు నేరుగా విదేశాలకు వెళతాయి. పటారీ స్టేషన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ స్టేషన్ నుండి పక్క దేశాలకు ఈజీగా వెళ్ళవచ్చు అలాగే జై నగర్ స్టేషన్ బీహార్‌లోని మధుబనిలో ఉంది. ఇక్కడి నుంచి నేపాల్‌కు రైళ్లు వెళ్తాయి. ఇక్కడి నుండి ఇంటర్ ఇండియా-నేపాల్ రైలు నడుస్తుంది.
ఈ రైలులో సులభంగా నేపాల్ వెళ్ళవచ్చు. చుట్టుపక్కల ప్రజలు నేపాల్ వెళ్లేందుకు ఈ రైలు సహాయం తీసుకుంటారు. హల్దీబారి స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్ గుడి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక స్టేషన్. ఇది బంగ్లాదేశ్ నుండి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ ట్రాన్సిట్ పాయింట్. ఇక్కడ నుండి మీరు సులభంగా బంగ్లాదేశ్ వెళ్ళవచు. బీహార్‌లోని జోగ్బాని జిల్లాలో ఉన్న స్టేషన్ నేపాల్‌కి చాలా దగ్గరగా ఉంది. అక్కడికి వెళ్ళడానికి రైలులో కూడా వెళ్లవలసిన అవసరం లేదు. భారతదేశం నుండి కాలినడకన నేపాల్ కు వెళ్లవచ్చు. ఇండియా లోని స్టేషన్లన్నింటిలో పంజాబ్‌లోని అత్యంత ప్రసిద్ధ స్టేషన్ అట్టారి స్టేషన్. ఇది ఉత్తర రైల్వే యొక్క చివరి స్టేషన్. ఇక్కడి నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పాకిస్థాన్‌కు వెళుతుంది. ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుంది.

అలాగే రాధికాపూర్ స్టేషన్ సరుకు రవాణా కోసం ఉపయోగించబడుతుంది. దీనిని జీరో పాయింట్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఈ స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ నుండి బంగ్లాదేశ్‌కు రైళ్లు ప్రయాణిస్తాయి. సింగాబాద్- స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఉంది. ఇక్కడి నుండి బంగ్లాదేశ్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు రోహన్‌పూర్ మీదుగా బంగ్లాదేశ్‌కు వెళుతుంది. పెట్రాపోల్ స్టేషన్ నుండి బంగ్లాదేశ్‌కు కూడా వెళ్లవచ్చు. ఈ స్టేషన్ ప్రధానంగా రెండు దేశాల మధ్య దిగుమతి ,ఎగుమతి కోసం ఉపయోగించబడుతుంది.