Facebook : ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం…ఇకపై వినియోగించాలంటే డబ్బులు చెల్లించాల్సిందే….

Facebook : ప్రస్తుతం ఉన్న కాలాన్ని సోషల్ మీడియా కాలం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కాలంలో చిన్నల నుండి పెద్దలు దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను చాలా బాగా వినియోగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ అందులో బ్యాలెన్స్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం దాంట్లోనే చూడవచ్చు. ఇక ఈ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాధరణ పొందిన వాటిలో ఇంస్టాగ్రామ్ ,ఫేస్ బుక్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇక ఈ యాప్స్ ను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. వీటిలో వచ్చే వీడియోలు రీల్స్ మీమ్స్ చూస్తూ చాలామంది కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఇలాంటి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్ లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

facebook-instagram-is-a-key-decision-now-you-have-to-pay-money-to-use-it

Advertisement

 

అయితే ఇప్పటివరకు ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్ ఫ్రీగా వాడేవాళ్ళం. కానీ ఇప్పటినుండి ప్రతినేల 3000 చెల్లించే విధంగా సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండు ప్లాట్ ఫామ్స్ లో యాడ్స్ సదుపాయం అందించేందుకు వినియోగదారుల నుండి నెలకు దాదాపు 40 డాలర్లు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యూరప్ వినియోగదారులకు ఈ రెండు ఫ్లాట్ ఫార్మ్స్ లకు కలిపి 15 డాలర్ల సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీ అందించనున్నట్లు సమాచారం. అయితే వినియోగదారుల సమ్మతి లేకుండా ఐరోపా లో నిర్దేశిత ప్రకటనల వ్యక్తిగత డేటాను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో

నియంత్రికుల ఆందోళనలు దృష్టిలో పెట్టుకొని ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ వినియోగదారులకు మూడు ఆప్షన్లను ఇవ్వనున్నట్లుగా మెట సంస్థ తెలిపింది. వాటిలో ఒకటి ప్రకటనలు లేకుండా వినియోగించడం కోసం డబ్బులు చెల్లించడం, రెండు వ్యక్తిగత ప్రకటనల తో రెండు ఫ్లాట్ ఫార్ములను ఉపయోగించుకోవడం , లేదంటే ఎకౌంటును క్లోజ్ చేసుకోవడం. అంటే సబ్ స్క్రిప్షన్ తప్పనిసరిగా తీసుకోవాలని అర్థమవుతుంది. ఇక మోట యుయూ ప్రకటనలతో ఈ యాప్లను ఉచితంగా అందించడం జరుగుతుంది.

Advertisement