Digital Rupee : ఎవరైనా డిజిటల్ రూపీని వాడుకోవచ్చు.. ఈ రూపీని ఉపయోగించే ప్రొసీజర్ ఇదే

Digital Rupee : మనం ఇన్ని రోజులు క్రిప్టోకరెన్సీని చూశాం కానీ.. ఆన్ లైన్ లో డబ్బులను దాచుకోవడం చూశాం, ఫిజికల్ కరెన్సీని చూశాం కానీ.. డిజిటల్ రూపీని మాత్రం చూడలేదు. కానీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా డిజిటల్ రూపీని లాంచ్ చేసింది. అయితే.. పైలట్ ప్రాజెక్ట్ ను నవంబర్ 1నే పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించింది. డిజిటల్ రూపీని ఆర్బీఐకి చెందిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మెయిన్ టెన్ చేస్తోంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ బ్యాంకులతో కలిసి ఈ రూపీని ప్రారంభించింది.

Advertisement
how to use digital rupee launched by rbi
how to use digital rupee launched by rbi

అయితే.. ప్రస్తుతానికి ఇది కేవలం హోల్ సేల్ లావాదేవీలకు మాత్రమే పరిమితం అయింది. కానీ.. డిసెంబర్ 1 నుంచి అంటే గురువారం నుంచి సీబీడీసీ రిటైల్ ప్రాజెక్ట్ ను ఆర్బీఐ లాంచ్ చేయనుంది. వ్యాపారులు, కొందరు కస్టమర్లను ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయనున్నారు. కరెన్సీ నోట్లు మనం ఇప్పుడు ఎలా ఉపయోగిస్తున్నామో.. ఈ రూపీ కూడా అలాగే చెల్లుబాటు అవుతుంది. కాకపోతే అది డిజిటల్ టోకెన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మనకు ఫిజికల్ గా అందుబాటులో ఉన్న కరెన్సీ డినామినేషన్స్ ను డిజిటల్ రూపీ డినామినేషన్స్ లో విడుదల చేయనున్నారు.

Advertisement

Digital Rupee : పలు బ్యాంకుల ద్వారా లాంచ్ కానున్న డిజిటల్ రూపీ

రిటైల్ డిజిటల్ రూపీని పలు బ్యాంకుల ద్వారా ఆర్బీఐ లాంచ్ చేయనుంది. డిజిటల్ కరెన్సీ డిజిటల్ వాలెట్ రూపంలో ఉంటుంది. ఆ కరెన్సీతో ఎలాంటి లావాదేవీలు అయినా చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా ఈ లావాదేవీలను చేయొచ్చు. సేమ్.. ప్రస్తుతం మనం వాడుతున్న పలు వాలెట్ యాప్స్ ద్వారా ఎలా లావాదేవీలు చేస్తామో.. ఈ డిజిటల్ రూపీతో కూడా అలాగే లావాదేవీలు చేయొచ్చు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ లో ప్రారంభం అవుతోంది. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతి, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, షిమ్లాలో ప్రారంభం కానుంది.

Advertisement