Nothing Phone 1 : నథింగ్ ఫోన్ 1 లాంచ్ అయింది.. ధర ఎంత? ఎలా కొనాలి? ఫీచర్స్ ఏంటి?

Nothing Phone 1 : చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న నథింగ్ ఫోన్ 1 నిన్న రాత్రే లాంచ్ అయింది. ఈ బ్రాండ్ నుంచి వచ్చి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. మూడు వేరియంట్స్ లో రెండు కలర్స్ లో నథింగ్ ఫోన్ 1 రిలీజ్ అయింది. ఈ ఫోన్ ట్రాన్స్ ఫరెంట్ డిజైన్ తో ఉంటుంది. 900 ఎల్ఈడీ లైట్స్ తో డిజైన్ అయిన ఈ ఫోన్ లో సూపర్బ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. రూ.32,999 స్టార్టింగ్ ధర నుంచి రూ.38,999 వరకు ఈ ఫోన్ ధరను నిర్ణయించారు. ఫ్లిప్ కార్ట్ లో జులై 21 నుంచి ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు.

Advertisement
nothing phone 1 launched in india with these specifications and price
nothing phone 1 launched in india with these specifications and price

6.55 ఇంచ్ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 60 హెచ్ జెడ్ నుంచి 120 హెచ్ జెడ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, హెచ్ డీఆర్ 10 ప్లస్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 778 ప్లస్ ఎస్ వోసీ, 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, 50 ఎంపీ సామ్ సంగ్ జేఎన్ 1 సెన్సార్ రేర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, హోల్ పంచ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 12 లోని నథింగ్ ఓఎస్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది.

Advertisement

Nothing Phone 1 : ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా

ఈ ఫోన్ లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఫేస్ అన్ లాక్ సపోర్ట్ కూడా ఉంది. 900 ఎల్ఈడీ లైట్స్ ఫోన్ లో ఉంటాయి. ఇవి.. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా.. కాల్, మెసేజ్, ఈమెయిల్ వచ్చినా వెలుగుతూ ఉంటాయి.

8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.32,999. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999, 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ మోడల్స్ ధర రూ.38,999.

జులై 21 న రాత్రి 7 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. ఆఫ్ లైన్ లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసేవాళ్లకు మాత్రం రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీ ఆర్డర్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ముందు ప్రీఆర్డర్ చేసుకున్నవాళ్లకు కంపెనీ మూడు వేరియంట్స్ మీద రూ.1000 డిస్కౌంట్ ఇస్తోంది. ప్రీ బుకింగ్ కూడా రూ.2000 పెట్టి ఫ్లిప్ కార్ట్ లో చేసుకోవచ్చు.

Advertisement