Reliance : రిలయన్స్ కొత్త ఆవిష్కరణ…ఆరు సెకండ్లలో బ్యాటరీ ఛార్జ్..

Reliance  : ప్రముఖ దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్వాపబుల్ బ్యాటరీలను ఆవిష్కరించింది. ఇక ఈ ఆవిష్కరణ గ్రేటర్ నోయిడా రెన్యువబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్ పో తో పాటు నిర్వహిస్తున్న” ది బ్యాటరీ షో ఇండియా” మొదటి ఎడిషన్ సందర్భంగా జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

reliances-new-innovation-battery-charge-in-six-seconds

Advertisement

అయితే స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్ ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ దశను పూర్తి చేసుకుందని, వచ్చే ఏడాది కల్లా ఇది కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటర్లు తెలియజేశారు. ఇక ఈ బ్యాటరీతో ఒకసారి చార్జ్ చేసి దాదాపు 70 నుండి 75 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. అంతేకాక ఈ బ్యాటరీలను సౌర శక్తిని ఉపయోగించి కూడా చార్జ్ చేసుకోవచ్చు.

ఇక ఈ రిలయన్స్ బ్యాటరీలు కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా , గృహ ఉపకరణాలకు కూడా ఉపయోగించేలా తయారు చేసామని సంబంధిత అధికారులు తెలియజేశారు. అయితే వాస్తవానికి వాహన వినియోగదారుడు చార్జింగ్ అయిపోయిన వెంటనే బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుంది. కావున ఆ బ్యాటరీని ఇంట్లో లేదా ఆఫీసులో కూడా మార్చుకోవచ్చు. అలాగే ఇవి స్టేషన్స్ లో చార్జింగ్ అయిపోయిన బ్యాటరీస్ ఇచ్చేసి ఫుల్ ఛార్జ్ బ్యాటరీ ని కూడా పొందవచ్చు. ఇక ఈ బ్యాటరీని మార్చుకోవడానికి కేవలం 6 సెకండ్ల సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు.

Advertisement