Land On Moon : భార్యకు బహుమతిగా చంద్రునిపై ఎకరం స్థలం….

Land On Moon : పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్య పుట్టినరోజు సందర్భంగా చంద్రునిపై ఎకరం భూమి కొని భార్యకు బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బెంగాల్లోని గర్ గ్రామ్ జిల్లాకు చెందిన సంజయ్ అనే వ్యక్తి తన భార్య అనువికకు ఈ బహుమతి ఇచ్చాడు. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం. గత ఏప్రిల్ నెలలోనే వివాహం చేసుకొని ఇద్దరు ఒకటయ్యారు. అయితే ప్రేమించుకునే రోజుల్లో అది ఇస్తా ఇది ఇస్తా అని చందమామను బహుమతిగా ఇస్తానని సంజయ్ ఏవేవో హామీలు ఇచ్చాడట. అయితే తాను అప్పుడెప్పుడో అన్న మాటలు నిజం చేయాలనుకుని చందమామపై ఎకరం స్థలం కొని భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు.

Advertisement

west-bengal-man-gifts-wife-one-acre-land-on-moon

Advertisement

అయితే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన తర్వాత చాలామంది చందమామపై స్థలాన్ని కొన్నామని తమ భార్యకి చెల్లికి తల్లికి బహుమతిగా ఇచ్చామని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వార్తలు విన్న సంజయ్ కూడా తన భార్యకు ఇలాంటి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నది తడవుగా చంద్రునిపై ఎకరం స్థలం కొనేశాడు. దానికి సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి భార్యకు బహుమతిగా ఇచ్చాడు. మరి చంద్రుని పై స్థలానికి ఎవరు యజమానులు, ఈ స్థలాలను ఎవరు అమ్ముతారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ చంద్రుని పై భూమి అమ్మకాలను సాగిస్తుందట. సంజయ్ తన భార్యకు చంద్రునిపై ఎకరం స్థలాన్ని లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఎకరం కేవలం 10 వేలకే కొనుగోలు చేశాడు.

west-bengal-man-gifts-wife-one-acre-land-on-moon

అలా పదివేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేయగానే ఇలా పత్రాలు వచ్చేశాయి. ఇక ఆ పత్రాలను తీసుకొచ్చి తన భార్యకు గిఫ్టుగా ఇచ్చాడు. అంతేకాక ఇటీవల ఓ తెలంగాణకు చెందిన మహిళ కూడా భూమిపై స్థలాన్ని కొన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువం పై చంద్రాయన్ 3 కాలు పెట్టిన రోజున ఎన్నారై సాయి విజ్ఞత స్థలాన్ని కొనుగోలు చేసేందుకు పెట్టుకున్న రిజిస్ట్రేషన్ పూర్తయింది. అలాగే విరువల్లి ,వాసి , జగన్నాధరావు అనే వారు కూడా చంద్రునిపై రెండు ఎకరాలు కొన్నారు. లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థలు చంద్రునిపై భూమిని విక్రయిస్తున్నాయి. చంద్రునిపై ప్రయోగాలు మరియు చంద్ర మండల అన్వేషణ అభివృద్ధి పరిశోధనలకు ఆర్థిక సాయం గాఅంతర్జాతీయంగా ఫండ్ ను చేపట్టేందుకు లూనార్ సొసైటీ ఇలా చేస్తుందని అర్థమవుతుంది. దీంతో చాలామంది ఈ సంస్థల ద్వారా చంద్రుని పై భూములు కొనుగోలు చేస్తున్నారు.

west-bengal-man-gifts-wife-one-acre-land-on-moon

అయితే చందమామ పై భూమిని కొంటున్నారు సరే , మరి హక్కులు మాటేంటి అంటే … చంద్రుని పై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. చందమామ పై భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు యాజమాన్య హక్కును పొందలేరు. భూమి వారి పేరున రిజిస్టర్ అయి ఉంటుంది అంతవరకే పరిమితం. చంద్రునితో సహా బాహ్య అంతరిక్ష ప్రపంచం ఎవరికీ సొంతం కాదని 1967లో అన్ని దేశాలు కలిసి ఒప్పందానికి కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భారత్ సహా 110 దేశాల సంతకం చేశాయి. 1967 అక్టోబర్ 10 న అమలులోకి వచ్చిన ఒప్పందం ప్రకారం చంద్రుడు ఎవరి సొత్తు కాదు. ఇది సింబాలిక్ మార్క్ మాత్రమే. దీనిపై ఎవరికి వ్యక్తిగత చెల్లుబాట్లు ఉండవు. ఇక ఇప్పుడు చంద్రునిపై స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి దానిపై ఎలాంటి హక్కులు ఉండవు.

west-bengal-man-gifts-wife-one-acre-land-on-moon

west-bengal-man-gifts-wife-one-acre-land-on-moon

Advertisement