
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. కొన్ని వీడియోలు మనల్ని భయపెట్టేవిగా ఉంటే మరికొన్ని వీడియోలు తెగ నవ్విస్తాయి. ఇక Social Media సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో వణుకు పుట్టేలా ఉంది. ఈ వీడియోలో ఒక దున్నను సింహాలు వెంటాడుతూ ఉంటాయి. మనకు తెలిసిందే సింహం ఎలాంటి జంతువునైనా చంపేయగలదని. అలాంటి సింహం నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు.
అలాంటిది అడవిదున్న సింహాల బారి నుంచి తెలివిగా తప్పించుకుంటుంది. ఒకటి కాదు రెండు కాదు పది సింహాల బారి నుంచి అత్యంత సులువుగా తప్పించుకుంటుంది. మగ సింహాలు చాలా అరుదుగా వేటాడుతాయి. ఎక్కువగా ఆడ సింహాలు వేటకు వెళుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక అడవి దున్నను పది సింహాలు చుట్టుముడతాయి. సింహాలన్ని చుట్టూ చేరి దాడికి ప్రయత్నిస్తున్నా, ఆ దున్న మాత్రం ధైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు రెడీ అయింది. చాలా తెలివిగా ఆ వేట సింహాల నుంచి తప్పించుకుంటుంది.
ఇంతకు ఆ దున్న సింహాలనుంచి తప్పించుకోవడానికి ఏం చేసిందో తెలుసా. తెలివిగా ఆ అడవిదున్న పక్కనే ఉన్న నీటి కొలనులోకి దిగుతుంది. సింహాలు నీటిలోకి రావు. దీంతో అది ధైర్యంగా ఆ నీటిలోకి దిగి సింహాల బారి నుంచి తప్పించుకుంది. ఇందులోకి దిగిన దున్న చాలా ధైర్యంగా నీళ్లలో నిలబడింది. తెలివిగా ఆ దున్న సింహాల నుంచి తప్పించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన డిజైన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అడవి దున్న తెలివికి హాట్సాఫ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram