Guinness World Record : ఆడవాళ్లకు జుట్టు అంటే ఎంతో ఇష్టం. చిన్న అమ్మాయిల దగ్గర్నుంచి.. పెద్ద వాళ్ల వరకు.. పొడవుగా జుట్టును పెంచుకోవాలని ఆశపడుతుంటారు. కానీ.. ఎంతమందికి జుట్టు పెరుగుతుంది. రకరకాల కారణాలతో చాలామంది జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎన్ని రకాల నూనెలు వాడినా కూడా జుట్టు మాత్రం పెరగదు. దీంతో చాలామంది అమ్మాయలు, యువతులు అయితే చాలా బాధపడుతుంటారు.

కానీ.. ఈ మహిళను చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. ఈ మహిళకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉంగరాల జుట్టు ఉంది. ప్రపంచంలోనే ఈ మహిళకు ఉన్న జుట్టు అది పొడవైనది. ఈమెకు ఉన్న ఉంగరాల జుట్టు ఇంకెవరికీ లేదు అంటే ఆశ్చర్యపోతారు.
Guinness World Record : తన జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది
ఫ్లొరిడాకు చెందిన 60 ఏళ్ల మహిళే ఈ రికార్డును క్రియేట్ చేసింది. తన పేరు ఆషా మండెలా. తనకు ఉన్న ఉంగరాల జుట్టు పొడవు అక్షరాలా 5.96 మీటర్లు. అంటే 19 ఫీట్ల 6.5 ఇంచులు. అది 2009 లో తనకు ఉన్న జుట్టు పొడవు. అప్పుడే తను గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా తన జుట్టును ఇంకాస్త పెంచుకొని 33.5 మీటర్లకు పెంచుకొని అంటే 110 ఫీట్లు పెంచుకొని మరోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టింది.
గత 40 ఏళ్ల నుంచి ఆషా ఇలా జట్టును పెంచుకుంటోంది. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు తను ఆ జుట్టును ఒక క్లాత్ బ్యాగ్ లో పెట్టుకొని కింద పడుకుండా చూసుకుంటుంది. ప్రతి వారానికి ఒకసారి తన జుట్టును ఆరు బాటిల్స్ షాంపును ఉపయోగించి వాష్ చేసుకుంటుంది. తనకు తన భర్తే సాయం చేస్తుంటాడు. ఆ జుట్టు ఎండటానికి కనీసం రెండు రోజులు పడుతుంది.