Viral Video : సముద్రంలో వేటకు వెళ్లారు.. నీటిపై తేలుతున్న వస్తువును పట్టుకొని తెరిచి చూసి షాక్

Viral Video : సముద్రంలో చాలా మంది చేపల వేటకు వెళ్తుంటారు. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు వాళ్లకు చేపలతో పాటు చాలా వస్తువులు వలలో పడుతుంటాయి. కొన్ని సార్లు పాములు పడుతుంటాయి. ఇంకేవో వింత జీవులు పడుతుంటాయి. కానీ.. తాజాగా చేపల వేటకు వెళ్లిన వీళ్లకు ఏం కనబడిందో తెలిస్తే షాక్ అవుతారు. మత్స్యకారులు చేపల కోసం సముద్రంలోకి వెళ్తారు.

brazil man stay afloat in sea video viral
brazil man stay afloat in sea video viral

అక్కడ వాళ్లకు దూరంగా నీళ్లలో తేలియాడుతూ ఓ వస్తువు కనిపిస్తుంది. ఏంటా అని దగ్గరికి వెళ్లి దాన్ని చూస్తారు. దీంతో అది ఏంటో కాదు.. ఫ్రీజర్. దాన్ని లాగడం కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఫ్రీజర్ లో నుంచి ఓ వ్యక్తి చేతులు ఊపుతూ కనిపించాడు. దీంతో పడవలోని వాళ్లు షాక్ అవుతారు. ఆ ఫ్రీజర్ లో మనిషి ఉన్నట్టు గుర్తించారు.

Viral Video : చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న వ్యక్తే అతడు

చేపల వేటకు వెళ్లిన ఆ వ్యక్తి.. సముద్రంలో తన పడవ మునగడంతో పడవలోని ఫ్రీజర్ ను పట్టుకొని కొన్ని రోజుల పాటు ఆ ఫ్రీజర్ లోనే ఉండి ప్రాణాలు కాపాడుకున్నాడు. 11 రోజుల పాటు ఫ్రీజర్ లోనే ఉన్నాడు. చివరకు చేపలు పట్టడానికి వెళ్లే మరో పడవ అక్కడికి చేరుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన దక్షిణ అమెరికాలోకి సురినామ్ అనే తీర ప్రాంతంలో చోటు చేసుకుంది. అతడిని పడవ పైకి ఎక్కించిన మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చి వదిలేశారు. అయితే.. అతడి దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏది ఏమైనా.. 11 రోజులు సముద్రంలోనే గడిపిన ఆ వ్యక్తి చివరకు ప్రాణాలతో బయటపడటంతో మృత్యుంజయుడయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.