Viral Video : పెళ్లిమండపంలో అందరి ముందే పిచ్చ కొట్టుడు కొట్టుకున్న పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. వైరల్ వీడియో

Viral Video : పెళ్లి అంటేనే సందడి.. వెనుకటి రోజుల్లో పెళ్లి అంటే ఓ వారం రోజుల ముందు నుంచే సందడి ఉండేది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును చేసినప్పటి నుంచి సందడి ఉండేది. బంధువులు, ఇంటి ముందు పచ్చటి తోరణాలు, సందడి.. అబ్బో ఆ రోజులే వేరు. కానీ.. ఇప్పుడు పెళ్లి అంటే అంత సందడి లేదు. చుట్టాల సందడి అస్సలే లేదు. ఇంటి దగ్గర కూడా సందడి ఉండదు. ఇప్పుడు పెళ్లిళ్లన్నీ ఫంక్షన్ హాల్స్ లోనే కదా జరిగేది.

Advertisement
bride and bridegroom fighting video viral
bride and bridegroom fighting video viral

సాధారణంగా ఈ మధ్య పెళ్లిళ్లలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పెళ్లిళ్లలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరిలో ఎవరో ఒకరు అలగడం.. పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోవడం లాంటివి చూస్తున్నాం. కొందరు పెళ్లికూతుళ్లు డైరెక్ట్ గా పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కూడా చూశాం.

Advertisement

Viral Video : పెళ్లిళ్లలో డ్యాన్సులు ఫేమస్

ఈమధ్య పెళ్లిళ్లలో డ్యాన్సులు తెగ ఫేమస్ అవుతున్నాయి. పెళ్లి మండపంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ డ్యాన్సులు వేయడం కూడా చూశాం. కానీ.. ఈ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ చూడండి. ఒకరిని మరొకరు చెంప చెళ్లుమనిపించుకున్నారు. పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు.

పెళ్లి అయిన తర్వాత నిలబడ్డ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. ఒకరినొకరు కొట్టుకున్నారు. పెళ్లి కొడుకు వధువు నోట్లో అరటిపెండు పెట్టగా.. ఆ వధువు తినలేదు. దీంతో కోపం వచ్చి తన చెంప మీద కొడతాడు వరుడు. దీంతో వధువుకు కోపం వచ్చి తను కూడా వరుడిని కొడుతుంది. ఇలా పెళ్లి మండపంలోనే అందరూ చూస్తుండగా ఒకరిని మరొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు అలాగే చూస్తూ ఉండిపోయారు.

పెళ్లికొచ్చిన వాళ్లు.. వీళ్ల కొట్టుకోవడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. పెళ్లి కాకముందే ఇలా కొట్టుకుంటే పెళ్లి అయ్యాక.. కొన్ని రోజుల తర్వాత వీళ్ల జీవితం ఎలా ఉంటుందో? ఎలా వీళ్లు కలిసి కాపురం చేస్తారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement