Viral Video : కొన్ని పెళ్లిళ్లలో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి సంఘటనలను మధుర జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకుంటారు అందరూ. ఈ రోజుల్లో అయితే పెళ్లిళ్లలో డ్యాన్సులు వేయడాలు.. సందడి చేయడం.. బంధువులందరితో సరదాగా గడపడం లాంటి సంఘటనలు అందరికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆ పెళ్లిలా అలా జరిగింది. ఈ పెళ్లిలో ఇలా జరిగింది.. అంటూ తర్వాత అందరూ గుర్తు చేసుకుంటారు.

తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వామ్మో.. పెళ్లికొడుకుకు ఇంత కోపం వస్తే ఇలా చేస్తారా అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video : పెళ్లి కొడుకుతో కేక్ కట్ చేయించిన బంధువులు
పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుతో కేక్ కట్ చేయించాలని బంధువులు అనుకున్నారు. దీంతో కేక్ ను తీసుకొచ్చారు. ఆ తర్వాత పెళ్లి కొడుకుతో కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత ఓ కేక్ ముక్క తీసుకున్న ఓ వ్యక్తి… వరుడికి తినిపించబోయాడు. ఒకసారి తినిపించబోయి ఆగుతాడు ఆ వ్యక్తి. దీంతో పెళ్లికొడుకుకు చిర్రెత్తుకొస్తుంది. ఆ తర్వాత మరోసారి తినిపించబోయి ఆగుతాడు. దీంతో కోపం వచ్చిన పెళ్లి కొడుకు పైకి లేచి కోపంతో అతడిని కొట్టబోతాడు. మున్ముందు ఇంకెలా ప్రవర్తిస్తాడో పిల్లాడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram