Viral Video : బాబూ.. ఇది సోషల్ మీడియా జనరేషన్. ఎప్పుడో పాత కాలం వాళ్లను పట్టుకొని వేలాడటం కాదు. అప్ డేట్ అవ్వాలి అని అంటున్నారు నేటి యూత్. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేటి యూత్ ఆలోచనలు కూడా చాలా మారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వల్ల నేటి యూత్ ఆలోచన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. వచ్చాయి. ఒకప్పుడు పెళ్లి అంటే పెళ్లికూతురు వంచిన తలను ఎత్తకపోయేది. కానీ.. ఇప్పుడు పెళ్లి అంటే పెళ్లికి ముందే ఎంగేజ్ మెంట్ కాగానే పెళ్లికొడుకు, పెళ్లికూతురు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఫోటోషూట్ లు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లు, రకరకాలుగా చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.

కాలంతో పాటు మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా వధూవరులు కూడా తమ పెళ్లిని కొత్తగా, వింతగా చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. రకరకాల ట్రెండ్స్ కు అలవాటు పడుతున్నారు. సోషల్ మీడియాలో తమ సత్తా చాటడానికి, వ్యూస్ పెంచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు.
Viral Video : ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఉంటాయా?
కానీ.. తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం తన పెళ్లి సాదాసీదాగా కావాలని అనుకోలేదు. తన పెళ్లి అందరిలా అయితే ఏముంటుంది కిక్కు అని అనుకుందో ఏమో కానీ.. వెరైటీ ఆలోచన చేసింది. పెళ్లి కోసం రెడీ అయింది. చీర కట్టింది. నగలు వేసుకుంది. అచ్చం పెళ్లికూతురులా రెడీ అయ్యాక.. పెళ్లి మండపం నుంచి మాయం అయిపోయింది. ఓవైపు పెళ్లి కోసం పెళ్లి కొడుకు, బంధువులంతా ఎదురు చూస్తుంటే.. పెళ్లి కూతురు మాత్రం ఏకంగా జిమ్ కు వెళ్లింది.
Pre-wedding photo shoot! Clear message to husband and in-laws??😀😅 pic.twitter.com/Njq0RjJXlc
— Samyuktha (@Samgurltweetz) August 28, 2022
పెళ్లికూతురు జిమ్ కు రావడం చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. పెళ్లి కూతురుగా రెడీ అయిన తర్వాత అక్కడికి వెళ్లిన ఆ యువతి.. జిమ్ లో కసరత్తులు చేయడం ప్రారంభించింది. ఓవైపు పెళ్లి కూతురుగా రెడీ అయి.. జిమ్ లో కసరత్తులు చేయడం ఏంటంటూ అక్కడున్న వాళ్లు ముక్కున వేలేసుకున్నారు.
అయితే.. ఇదంతా ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగం. చాలామంది ప్రీవెడ్డింగ్ షూట్ లో పాల్గొంటారు కదా. కానీ.. ఈ యువతి మాత్రం తన ప్రీ వెడ్డింగ్ షూట్ ను డిఫరెంట్ గా చేయించుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ వీడియోను చూసి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.