Viral Video : బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది….వినాయక చవితి రోజు రెండు తలాలతో పుట్టిన దూడ…

Viral Video : కడప జిల్లా గద్వేల్ మండలంలో బాలయ్యపల్లి లో ఓ వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. బుధవారం వినాయక చవితి రోజున బాలయ్య పల్లి గ్రామానికి చెందిన మన్యం శంకర్ రెడ్డి అనే రైతు ఇంట్లో గేదెకు రెండు తలల దూడ జన్మించింది. ఇక వినాయక చవితి రోజున రెండు తలల దూడ జన్మించడంతో ఈ వింత దూడను చూసేందుకు పక్క గ్రామాల జనం కూడా చాలామంది వచ్చారు.చుట్టుపక్కల గ్రామాల వారు చాలామంది అధిక సంఖ్యలో అక్కడికి వచ్చి ఆ దూడను చూస్తున్నారు. అయితే పుట్టిన దూడ ఆరోగ్యంగానే ఉందని రైతు చెబుతున్నాడు. వినాయక చవితి రోజు వింత దూడ పుట్టడం దేవుడు మహిమ అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

calf-born-with-2-heads-in-balayapalli-village-cuddapah-district-on-ganesh-chaturthi

Advertisement

ఇక ఈ విషయం తెలుసుకున్న పశు వైద్య అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు.  మొత్తం పరిశీలించి జన్యుపరమైన లోపాల వలన అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని వైద్య నిపుణులు తెలియజేశారు. అలాగే ఇది మంచి పరిణామం కాదని చెబుతున్నారు.ఇలా జన్యూ పరమైన లోపాలు కారణంగా వింతగా పుట్టే జంతువులు ఎక్కువ కాలం జన్మించే అవకాశం లేదని తెలియజేశారు. అంతేకాక బ్రతికినంత కాలం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందని , దాని మెదడులో కొన్ని సమస్యలు కూడా వస్తాయని అధికారులు చెబుతున్నారు.  అయితే చాలామంది వినాయక చవితి రోజున రెండు తల దూడ జన్మించడంతో అద్భుతంగా భావిస్తున్నారు.

calf-born-with-2-heads-in-balayapalli-village-cuddapah-district-on-ganesh-chaturthi

ఇప్పటికీ గేదే మరియు రెండు తలాల దూడ క్షేమంగానే ఉన్నాయి. ఇలా వినాయక చవితి రోజు వింత దూడ జన్మించడంతో ఆ ఇంటి రైతు అదృష్టంగా భావిస్తున్నాడు. ఇక దీనిని చూసేందుకు చాలా మంది చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ఇదంతా దైవ మహిమ వలన జరిగిందని అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. జన్యు లోపం వలన జరిగినప్పటికీ ఇది వింత అనే చెప్పాలి. దీంతో కొందరు పురాణాలను బయటకు తీసి ఒకప్పుడు ఈ విషయాన్ని బ్రహ్మంగారు కూడా చెప్పారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీనిలో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు కానీ ఈ వింతను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement