Viral Video : సాధారణంగా పాములను చూస్తేనే కొందరు జడుసుకుంటారు. పాములు అంటేనే కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. పామును చూసి జన్మలో కూడా అక్కడికి వెళ్లరు. కాకపోతే పాములను పట్టేవాళ్లు మాత్రం చాలా ధైర్యం చేస్తుంటారు. ఏమాత్రం భయం లేకుండా పాములను పడుతూ ఉంటారు. వాళ్లనే స్నేక్ క్యాచర్స్ అంటారు. వాళ్లు పాములను పట్టడం నేర్పరులే కానీ.. ఒక్కోసారి పాముల వల్ల అవి వేసే కాటు వల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోతుంటారు.

అలాంటి చాలా ఘటనలను మనం చూశాం. తాజాగా యూపీలోని జౌన్ పూర్ జిల్లాకు చెందిన మురళీవాలే హౌస్లా అనే వ్యక్తి ఓ పాడుబడ్డ బావిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన పాములను చాకచక్యంగా పట్టి బంధించాడు. ఆయన డేరింగ్ స్నేక్ క్యాచర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తను ఎప్పుడు పాములను పట్టినా.. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా ఓ పాడుబడ్డ బావిలో నుంచి పలు పాములను బంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు.
Viral Video : డేర్ చేసి బావిలోకి దిగి మరీ పాములను బంధించిన మురళి
అంబేడ్కర్ నగర్ జిల్లాలోని ఓ పాడు బడ్డ బావిలో పాములు ఉన్నాయని తెలుసుకున్న మురళి అక్కడికి వెళ్లాడు. గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. బావి మధ్యలో పెద్ద చెట్టు ఉంది. బావి లోపల విషపూరితమైన పాములు ఆరు ఉన్నాయి. ఒక పాము చనిపోయింది. రెండు నల్ల త్రాచు పాములు, రెండు రక్త పింజర, రెండు ర్యాటిల్ స్నేక్స్ మొత్తం ఆరుపాములు ఉన్నాయి.
వెంటనే బావిలోకి దిగిన మురళి.. ఒక్కొక్కటిగా పాములను పట్టుకొని తను తీసుకొచ్చిన బ్యాగులో వేశాడు. ఎంతో చాకచక్యంతో ఆ పాములను పట్టుకొని సంచుల్లో బంధించాడు మురళి. ఆ తర్వాత పైకి వచ్చేశాడు. ప్రస్తుతం మురళి బంధించిన పాముల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత విషపూరితమైన పాములను భలేగా పట్టాడు అంటూ మురళిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.