Viral Video : మంచం మీద పడుకున్న మహిళ.. తన మీదికి ఎక్కిన నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే

Viral Video : పామును దూరం నుంచి చూస్తేనే హడలిపోతాం. పరుగుపందెం పెట్టినట్టు అక్కడి నుంచి పారిపోతాం. పాము ఎక్కడో ఉంటేనే అంతలా భయపడితే.. పాము మన దగ్గరికి వస్తే.. మన మీదికే పాము ఎక్కితే ఏం చేస్తాం. అయ్యో దేవుడా.. నాకు ఎందుకు ఈ శిక్ష అని దేవుడిని తలుచుకోవడం తప్పితే మనం చేసేదేం ఉండదు. దేవుడి భారం వేసి ఆ పామును కరవకుండా చూడు స్వామీ అంటూ దేవుడిని మొక్కుకుంటాం.

Advertisement
cobra lying on woman body video viral
cobra lying on woman body video viral

ఇంకొందరైతే పాము మీదికి ఎక్కిందని తెలియగానే.. ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. అక్కడి నుంచి పరిగెత్తుతారు. లబో దిబో అంటూ అక్కడి నుంచి పరుగు లంఖించుకుంటారు. ఓ మహిళ మాత్రం తన మీదికి విషపూరితమైన నాగుపాము ఎక్కితే ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు.

Advertisement

Viral Video : మహిళ మీదికి ఎక్కి పగడ విప్పిన కోబ్రా

ఓ మహిళ తన పొలంలో మంచం మీద పడుకొని ఉంది. ఇంతలో ఓ నాగుపాము మెల్లగా మంచం ఎక్కి పడుకున మహిళ మీదికి ఎక్కింది. ఆ తర్వాత పడగ విప్పింది. ఏదో తన మీదికి ఎక్కినట్టు భావించిన ఆ మహిళ చూస్తే అది నాగుపాము. వెంటనే చాకచక్యంగా వ్యవహరించిన ఆ మహిళా.. అస్సలే కదలకుండా అలాగే బోర్లా పడుకొని రెండు చేతులతో దేవుడిని ప్రార్థిస్తూ అలాగే ఉండిపోయింది. కొన్ని నిమిషాల పాటు ఆ మహిళపై పాము అలాగే పడగ విప్పింది. ఆ మహిళ కదలకుండా అలాగే ఉండిపోయేసరికి ఆ పాము మెల్లగా అక్కడి నుంచి ఆ మహిళకు ఎలాంటి ప్రాణ హాని కలిగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ ఘటనకు కొంచెం దూరంలో ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఇలా మీకు జరిగితే ఏం చేస్తారు అని క్యాప్షన్ పెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ పాము ఆ మహిళను ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆయన పోస్ట్ చేశాడు. ఇక.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ మహిళ చాలా తెలివితో, చాకచక్యంగా వ్యవహరించి పాము కాటు నుంచి తప్పించుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement