Viral Video : బైక్ పై రెచ్చిపోయిన లవర్స్…. ముద్దులతో రెచ్చిపోతూ అడ్డంగా బుక్కయ్యారు….

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అనేక రకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక నేటి యువత సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం కోసం పిచ్చిపిచ్చి పనులను చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా వేదికగా మనం చాలానే చూస్తున్నాం. ఇక ఇప్పుడు అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో సగటు జంట కావాలని చేశారో లేక చుట్టుపక్కల ఉన్నవాళ్లు రికార్డ్ చేశారో తెలియదు కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వారిది బరితెగింపుగా అభివర్ణిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

Advertisement

couple-kissing-on-bike-in-jaipur-video-viral

Advertisement

రాజస్థాన్ లోని జైపూర్ లో వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనంపై ఓ ప్రేమ జంట పయనిస్తుంది. ఇక వీరిద్దరూ ప్రయాణం చేస్తుంది. నడిరోడ్డు అయినప్పటికీ లిఫ్ టు లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. ఈ సమయంలో వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయారు. దీంతో ప్రమాదకరమైన ఈ కిస్ స్టంట్ కెమెరాకు చిక్కింది. ఇంకేముంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అమ్మాయి అబ్బాయి ముద్దులు పెట్టుకోవడం గమనించవచ్చు. అయితే ఈ ఘటన జైపూర్ లోని దుర్గాపుర ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు పోలీసులకు చేరింది.

couple-kissing-on-bike-in-jaipur-video-viral

దీంతో పోలీసులు వెంటనే సదరు జంటను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. కాగా ఈ వీడియో చూసిన నేటిజనులు ఆ జంటపై మండిపడుతున్నారు. భారత యువత నేడు కామం అనే వికారంలో కొట్టుమిట్లాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఇలాంటి వారిని కన్నవారు ఎంతటి దురదృష్టవంతులు అని వాపోతూ కామెంట్స్ చేశారు. మరికొందరు ఇలా బరితెగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది.

Advertisement