Viral Video : వామ్మో….పాకిస్థానీలు ఇలా కూడా ఆలోచిస్తారా…

Viral Video : కాశ్మీర్ విషయంలో తరచు పాకిస్తాన్ కి మరియు భారతదేశానికి మధ్య ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియా వచ్చిన నేపథ్యంలో ఎక్కడెక్కడ జరిగిన వీడియోలు కూడా అందరికీ చేరుతున్నాయి. అయితే తాజాగా కాశ్మీర్ గురించి ఓ పాకిస్తానీ తన అభిప్రాయం తెలియజేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక వీడియో లో పాకిస్తాన్ వ్యక్తిని కాశ్మీర్ ఎవరిదని ఓ యాంకర్ ప్రశ్నించగా…దానికి అతను కాస్త పరిహాసంగా కాశ్మీర్ లో ఉండే వారిదని సమాధానమిచ్చాడు. అదేంటి కాశ్మీర్ పాకిస్తాన్ ది అని మనం అంటుంటాం కదా అని యాంకర్ ఎదురు ప్రశ్నించింది.

Advertisement

do-pakistanis-even-think-like-this

Advertisement

అది ఎప్పుడు జరిగింది. అక్కడ ఉన్నది భారత సైన్యం కాబట్టి కాశ్మీర్ భారతీయులదే , పాకిస్తాన్ ది కాదు అని సమాదానం ఇచ్చాడు. ఇక అప్పుడు యాంకర్ అక్కడ పాకిస్తాన్ సైన్యం కూడా ఉందని ఆ వ్యక్తికి తెలియజేస్తుంది. కాశ్మీర్ భూభాగం 30% పాకిస్థాన్ లో 10% చైనా మిగిలిన భూభాగం ఇండియాలో ఉందని చెబుతుంది. ఎలా చూసిన సరే కాశ్మీర్ ఇండియా దేనని అతను సమాధానం ఇచ్చాడు. అంతేకాక ఇక్కడ తినడానికి తిండి లేదు కాశ్మీర్ సొంతం చేసుకుని ఏం చేస్తామంటూ సూటిగా మాట్లాడాడు. అయితే నిజమేంటో మాకు తెలుసు మీకు తెలుసు అయినా కాశ్మీర్ పాకిస్తాన్ ది అని మనం ఎందుకు అంటున్నామని యాంకర్ ప్రశ్నించింది. దీంతో ఆ వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా మనమంతా పిచ్చోళ్ళం అని చెప్పేసాడు. ఇది విన్న యాంకర్ నోరేళ్ళ పెట్టింది.

ఏంటి మనం పిచ్చోళ్ళమా 70 ఏళ్లుగా మనం పిచ్చోళ్ళ లాగే ఉన్నామా అని ఎదురు ప్రశ్నించింది. దానికి అతను సమాధానం ఇస్తూ తరతరాలుగా రాజకీయ నాయకులు మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారంటూ పేర్కొన్నాడు. ఇక్కడ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే కాశ్మీర్ సాధించి ఏం చేస్తామని కుండ బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని వ్యాపార కార్యకలాపాలు కుంటుపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో ప్రస్తుతం పాకిస్తానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో దుమారం లేపుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన భారతీయులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పాకిస్తాన్ లోని ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే రెండు దేశాలకు ఎలాంటి సమస్యలు ఉండవని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Ankit Aggarwal (@ankitaggarwal322)

Advertisement