Viral Video : దొంగతనం చేయాలంటే చాలా తెలివి ఉండాలి. దొంగతనం చేయడమంటే అంత ఈజీ కాదు. ఒకప్పుడు దొంగతనం వేరు.. ఇప్పటి దొంగతనం వేరు. దొంగలు కూడా బాగా అప్ డేట్ అయ్యారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు కూడా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతున్నారు. దొంగతనం చేసే టైప్ ను మారుస్తున్నారు. దొంగలు 2.0 అన్నట్టుగా వాళ్ల దొంగతనాలు ఇప్పుడు ఉంటున్నాయి. అందుకే వాళ్ల మెదడుకు పదును పెడుతున్నారు. పక్కన ఉన్నవాళ్లకు తెలియకుండా.. అంతెందుకు దొంగతనం చేసే వాళ్లకు కూడా తెలియకుండా దొంగతనం చేస్తున్నారు నేటి దొంగలు.

ఎంతో స్మార్ట్ గా దొంగతనం చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా మాల్ మధ్యలో.. ఎంతో సైలెంట్ గా దొంగతనం చేసేశారు. అసలు ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేం. అంత సైలెంట్ గా పని కానిచ్చేశారు. ఆ దొంగతనం చేసింది కూడా ఎవరో కాదు.. ఇద్దరు వృద్ధ దంపతులు. వాళ్లు చేసిన దొంగతనం స్టయిల్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. వాళ్లు ఎంతో ప్రొఫెషనల్ దొంగల్లా ఈ పని కానిచ్చేశారు.
Viral Video : సైలెంట్ గా మొక్కను కొట్టేశారు
మాల్ మధ్యలో ఎస్కలేటర్ దగ్గర ఓ వృద్ధ జంట నిలబడ్డారు. ఎస్కలేటర్ మీద వస్తూ పోతూ ఉన్నవాళ్లను చూశారు. అక్కడే ఒక మొక్కను షో కోసం పెట్టి ఉంచారు. ఆ మొక్కను ఎవ్వరూ చూడకుండా ఉన్నప్పుడు వాళ్లు తెచ్చుకున్న సంచిలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను మాల్ లో ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైలెంట్ గా పని కానిచ్చేసిన ఈ వృద్ధ జంటను చూసి నెటిజన్లు షాక్ అవుతారు. వామ్మో.. ఈ వృద్ధ జంట చాలా ప్రొఫెషనల్ దొంగల్లా చేసిన దొంగతనాన్ని చూసి ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram