Viral Video : చెట్టు ఎక్కిన గజరాజు….పనస పండు కోసం సరికొత్త విన్యాసాలు….

Viral Video : అడవి జంతువులలో ఏనుగు ఎంత శక్తివంతమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడవికి రాజుగా పిలవబడే సింహమైనా సరే ఏనుగు జోలికి వెళ్లాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది. ఒక్కసారి ఏనుగు ఘింకరించిందంటే …ఆ శబ్దానికి పులులు సింహాలు సైతం పరుగులుు పెట్టాల్సిందే. కొన్ని సందర్భాలలో ఏనుగులు కోపంతో పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి సందర్భాలలో పెద్దపెద్ద చెట్లను అవలీలగా పెక్కిలించేస్తాయి. ఇక ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా వేదిక మనం చాలానే చూస్తుంటాం. అయితే ఇప్పుడు ఓ ఏనుగు కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

Advertisement

elephant-plucking-the-jackfruit-video-is-going-viral

Advertisement

అందనంత ఎత్తులో ఉన్న పనస పండ్లను ఆకలితో ఉన్న ఏనుగు చాలా తెలివిగా అందుకోవడాన్ని చూసి నేటిజనులు అవాక్కవుతున్నారు. పూర్తి వివరాల్లోకెళితే… విపరీతమైన ఆకలితో ఆహారం కోసం చూస్తున్న ఏనుగుకు ఎదురుగా ఒక పెద్ద పనస చెట్టు కనిపించింది. ఆ పనస చెట్టు చాలా పెద్దది అవ్వడంతో దానికి కాయలు కూడా అందనంత ఎత్తులో ఉన్నాయి. అంత ఎత్తులో ఉన్న పండ్లను అందుకోవడం ఏనుగు సాధ్యం కాదని అక్కడున్న వారంతా అనుకున్నారు కానీ ఎలాగైనా పనస పండ్లను తినాలని అనుకున్న ఏనుగు చెట్టు దగ్గరికి వెళ్లి తొండం పైకెత్తిన పండ్లు అందలేదు.

దీంతో చెట్టునే వంచాలని చూసింది కానీ సాధ్యం కాలేదు. ఎలాగైనా తినాలని గట్టిగా అనుకుందో ఏమో కానీ చివరికి తన రెండు కాళ్ళను చెట్టు మొదలపై పెట్టి తొండాన్ని పైకి చాపి మరి పండ్లను తెంపింది. కిందపడిన పండ్లను తిని తన ఆకలిని తీర్చుకుంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏనుగు తెలివి అద్భుతం అంటూ మెచ్చుకుంటున్నారు. మరికొందరు ఏనుగా మజాకా దాని కింద ఏదైనా బలాదూర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement