Viral Video : ఇంట్లో దూరి బయటికి రావడానికి నానా తంటాలు పడ్డ ఏనుగు.. వైరల్ అవుతున్న వీడియో…

Viral Video : ఏనుగులకు సంబంధించి డైలీ మనం ఎన్నో రకాల వీడియోలను చూస్తూ ఉంటాం. అందులో కొన్ని నవ్వు తెప్పించేవిగాను మరికొన్ని భయపెట్టే విధానం ఉంటాయి. ముఖ్యంగా ఏనుగులు ఎక్కువ శాతం అడవిలో తమ పరిధి దాటి బయటకు రావు. కానీ ఆహారం కోసం నీటి కోసం ఒక్కొక్కసారి జనావాసాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తాయి. ఇంకా ఆహారం విషయంలో ఏనుగులు వాసనను పసిగట్టి ఎంత దూరం నుండైనా వస్తాయి. కుక్కలతో పాటు ఏనుగులు కూడా చాలా మైళ్ళ దూరం వరకు వాసనను గ్రహించగల శక్తి కలిగి ఉంటాయి. అటువంటి ఒక ఏనుగు ఆహారం కోసం ఒక ఇంట్లో దూరిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఏనుగు ఇంట్లో దూరి ఆహారాన్ని భుజించి తర్వాత బయటికి రావడానికి ఈ ఏనుగు పడ్డ ఇబ్బందిని వీడియోలో చూపించారు.

Viral Video : ఇంట్లో దూరి బయటికి రావడానికి నానా తంటాలు పడ్డ ఏనుగు..

ఈ వీడియోలో మొదట ఏనుగు ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉండగా చాలాసేపటి వరకు ప్రయత్నించి మొదట తన తలను వంచి తరువాత మెల్లగా బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. అతి కష్టం మీద ఎంతో ప్రయత్నించి ఆ ఇంట్లో నుండి ద్వారం ద్వారా బయటికి వస్తుంది. ఆ ఏనుగు బయటికి రావడానికి పడిన ఇబ్బందిని ఈ వీడియోలో చూపించిన ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆహారం కోసం ఇంట్లో కెళ్ళి బయటికి వచ్చే సమయంలో ఏనుగుపడ్డ ఇబ్బందికి మెడిజనులందరూ చాలా రకాలుగా సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏనుగు ఇంట్లో నుంచి బయటికి వచ్చిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

elephant was trying to get out of the house video viral
elephant was trying to get out of the house video viral

ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ కష్టాలు పోస్ట్ చేసిన ఈ వీడియో ఏనుగు భవనం నుండి జాగ్రత్తగా బయటకు రావడానికి చేసిన ప్రయత్నం ఈ వీడియోలో ఉంది. సుశాంత్ నందా గారు ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగానే చాలామంది నెటిజన్లు ఈ వీడియోని షేర్ చేస్తూ ఇంకా లైక్ చేస్తూ ఉన్నారు. కాగా ఈ వీడియోకి క్యాప్షన్ గా ఏనుగు తనకి ఇష్టమైన స్నాక్స్ ని ఇంటిలోని తిని దర్జాగా బయటికి వస్తుంది అంటూ ఇంకా కుక్కలతో పాటు ఏనుగులు కూడా ఆహారపు వాసనను ఎంత దూరం నుంచి అయినా కనిపెట్టగలవు అంటూ క్యాప్షన్ ఈ వీడియోకి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా అనేకమంది సోషల్ మీడియాలో తమ కామెంట్లతో ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు. ఇంటిలో దూరిన ఈ ఏనుగు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.