Viral Video : తండ్రీ కొడుకుల కంటే కూడా తండ్రీ కూతుళ్ల మధ్య బంధం ఎక్కువగా ఉంటుంది. తల్లికి కొడుకంటే ఇష్టం అంటారు. కానీ.. తండ్రికి మాత్రం కూతురంటేనే ఇష్టం. తన తండ్రిని చూస్తూ పెరిగిన అమ్మాయి పెద్దయ్యాక తన తండ్రినే అదర్శంగా తీసుకుంటుంది. పెళ్లయ్యేవరకు తన తండ్రే ప్రతి కూతురుకు హీరో. అతడి అడుగుజాడల్లోనే నడుస్తుంది. అందులోనూ ప్రతి కూతురుకు తన తండ్రి అంటేనే ఇష్టం. అందుకే వాళ్లిద్దరి మధ్య ఉన్న బాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

కానీ.. వాళ్ల మధ్య బంధం కొన్నిరోజులే ఉంటుంది. ఎంత కూతురు అయినా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాల్సిందే. జీవితాంతం కూతురు తండ్రి దగ్గర ఉండదు కదా. కూతురుకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే సమయంలో తండ్రి ఎంతలా బాధపడుతాడో అందరికీ తెలుసు. కానీ..ఈ తండ్రి మాత్రం తన కూతురుకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే సమయలో ఎలా తన మెమోరీస్ ను భద్రపరుచుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Viral Video : ఈ తండ్రి చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు
కూతురు కుర్చీపై కూర్చొని ఉండగా తల్లిదండ్రులు నేల మీద కూర్చున్నారు. తనకు కొన్ని రోజుల ముందే పెళ్లి అయింది. అత్తవారింటికి తనను పంపించాలి. అందుకే తన కూతురు పాదముద్రలను తీసుకోవాలనుకున్నాడు ఆ తండ్రి. అంతకంటే ముందు నీళ్లు, పాలతో తన కాళ్లను కడిగి వాటినే తాగేశారు. ఆ తర్వాత ఎర్రటి నీళ్లలో కూతురు పాదాలను పెట్టి ఆ పాదాలను ఒక తెల్లటి బట్టపై పెట్టేలా చేశారు. ఆ పాదాల ముద్ర ఆ తెల్లటి బట్టపై పడేలా చేశారు. కూతురు పాదాల ముద్రలను తెల్లటి గుడ్డపై భద్రంగా దాచుకున్నారు.
भावुक पल..
विदाई से पूर्व बेटी के पद-चिन्हों को घर में संजोकर रखते मां-बाप..💕#HeartTouching
VC : SM pic.twitter.com/kJdF8dj4e6— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 22, 2022
ఈ ఘటనను వీడియో తీసి తన తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంచీ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోను చూసి నెటిజన్లు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు. వాట్ యాన్ ఎమోషనల్ మూమెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.