Video Viral : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు ఎలాంటి క్రేజ్ ఉందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే నేటి యువత విపరీతంగా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది రీల్స్, షాట్స్ అంటూ పబ్లిక్ లోనే బరితెగించే పనులు చేస్తున్నారు. మరికొందరు సిగ్గు బిడియం ఏ మాత్రం లేకుండా అందరి ముందే డాన్స్ ప్రదర్శనలు చేస్తున్నారు. మరి కొందరు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రాణాంతక సాహసాలను కూడా చేస్తున్నారు. ఇక ఇలాంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో అమ్మాయి రీల్స్ చేస్తున్న సమయంలో ఆమె వెనుక ఓ వ్యక్తి ఆమె చేసినట్లుగానే డాన్స్ చేయడంతో ఆమె ప్లాన్ కాస్త రివర్స్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.
అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేసేందుకు మార్కెట్ సమీపంలోని నడిరోడ్డుపై డాన్స్ చేసేందుకు సిద్ధమైంది. ఇక ఆ ప్రదేశంలో చాలామంది వస్తు పోతూ ఉన్నారు. అంతేకాక అది మార్కెట్ ప్లేస్ అవడంతో జనాలు కూడా బాగానే ఉన్నారు.అయినా కూడా ఆమె అక్కడ డాన్స్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమె డాన్స్ చేస్తున్న సమయంలో ఆమె వెనుక ఒక వ్యక్తి డాన్స్ చేయడం ప్రారంభించారు. ఇక అతను వాలకం చూస్తే తాగి ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఆ అమ్మాయి ఎలా అయితే డాన్స్ చేస్తుందో అచ్చం అలాగే అతను కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త ఫన్నీగా మారింది.
దీంతో ఈ వీడియోని అమ్మాయి తన సోషల్ మీడియా షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వేలలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో 3 లక్షలకు పైగా లైక్స్ ను సంపాదించింది. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి డాన్స్ కంటే అంకుల్ డాన్స్ బాగుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి క్రెడిట్స్ మొత్తం అంకుల్ కొట్టేసాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఆ అమ్మాయికి మాత్రం సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చి పెట్టిందని చెప్పాలి. అనుకోకుండా వచ్చిన ఆ వ్యక్తి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.
View this post on Instagram