Viral Video : పుట్టగానే శ్వాస తీసుకోలేకపోయిన చిన్నారిని ఈ డాక్టర్ ఎలా కాపాడిందో చూస్తే ఫిదా అవుతారు

Viral Video : పిల్లలను కనడం అనేది మహిళలకు ఒక వరం. దేవుడిచ్చిన వరం. అమ్మతనం అనేది ఊరికే రాదు. అమ్మ అని పిలిపించుకోవాలంటే ఎంతో కష్టపడాలి. తొమ్మిది నెలలు బిడ్డను కడుపులో మోసి.. డెలివరీ సమయంలో వచ్చే ఎంతో నొప్పిని ఓర్చుకొని బిడ్డను కని పెంచితే అప్పుడు అమ్మ అని పిలిపించుకోగలుగుతుంది మహిళ. అందుకే మహిళలకు మన సమాజంలో ఉండే గౌరవమే వేరు. వాళ్లకు చాలా మర్యాద ఇవ్వడానికి కారణం అదే. మహిళలే లేకపోతే అసలు ఈ సమాజమే ఉండదు.

Advertisement
lady doctor revives new born with cpr in agra video viral
lady doctor revives new born with cpr in agra video viral

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. లేడీ డాక్టర్.. అప్పుడే పుట్టిన శిశువును కాపాడిన వీడియో అది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆగ్రాకు చెందిన సురేఖా చౌదరి అనే డాక్టర్ అప్పుడే పుట్టిన శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం గమనించింది. ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించింది. దీంతో వెంటనే సీపీఆర్ చేసింది. ఆ శిశువు నోట్లో నోరు పెట్టి శ్వాస అందించింది.

Advertisement

Viral Video : శిశువు ప్రాణాలు కాపాడిన డాక్టర్

అలా కాసేపు సీపీఆర్ చేసి.. తన కిందికి వేలాడదీసి తన చేతులతో అటూ ఇటూ చరచగానే ఆ చిన్నారి శ్వాస తీసుకుంది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలను కాపాడగలిగింది ఆ డాక్టర్. నార్మల్ డెలివరీ ద్వారా ఆ చిన్నారి జన్మించినా.. పుట్టగానే శ్వాస తీసుకోవడం ఆ చిన్నారికి ఇబ్బంది అయింది. ఆ చిన్నారి శ్వాస తీసుకోవడంలో సమస్య ఉందని తెలుసుకొని వెంటనే సీపీఆర్ చేసి బతికించిన ఆ డాక్టర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సచిన్ కౌషిక్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి అందుకే డాక్టర్లను మనం దేవుడితో పోల్చుతాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement