Viral Video : భయంకరమైన యాక్సిడెంట్ జరిగినా వెంట్రుకవాసిలో చావును తప్పించుకున్నాడు.. ఎలాగో చూడండి

Viral Video : ఈ భూమ్మీద నూకలు ఉంటే ఎంత పెద్ద విపత్తు వచ్చినా బతికి బట్టకడతాం అంటారు పెద్దలు. అదే నూకలు లేకపోతే.. ఇంట్లో కూర్చొన్నా కూడా మృత్యువు పలకరిస్తుంది. ప్రతి నిమిషం.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని వేల మంది రోజూ యాక్సిడెంట్లతో చనిపోతూ ఉంటారు. కొందరు క్షణాల్లో, వెంట్రుకవాసిలో చావును తప్పించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్లలో ఈ వ్యక్తి కూడా ఒకరు. వెంట్రుకవాసిలో చావును తప్పించుకొని మృత్యుంజయుడయ్యాడు.

Advertisement
man escaped death miraculously in accident video viral
man escaped death miraculously in accident video viral

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ భయంకరమైన యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతోంది.

Advertisement

Viral Video : అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ఎలా తప్పించుకున్నాడు

హిట్ అండ్ రన్ ప్రమాదాల గురించి తెలుసు కదా. ఇది కూడా అలాంటిదే. కానీ.. ముందు వెళ్తున్న ఓ వ్యాన్ ను వెనుక నుంచి వచ్చిన మరో వ్యాన్ ఢీకొడుతుంది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి తుక్కుతుక్కుఅవుతుంది. వెనుక వ్యాన్ లో ఉన్న డ్రైవర్ వేగంగా వ్యాన్ లో నుంచి కిందికి తోసేయబడతాడు.

జస్ట్ మిస్ అయితే.. ముందు ఉన్న వ్యాన్ కింద పడేవాడే. కానీ.. కొంచెం ముందు రోడ్డు మీద విసిరేసినట్టుగా కింద పడ్డాడు. దీంతో బతికి బట్టకట్టాడు. లేకపోతే వ్యాన్ కింద పడి నుజ్జునుజ్జుఅయ్యేవాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.

Advertisement