Viral Video : సోషల్ మీడియాలో రోజూ కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. కానీ.. అందులో వైరల్ అయ్యేవి మాత్రం చాలా తక్కువ. అవును.. చాలా వీడియోల్లో జనాలకు నచ్చేవి కొన్ని ఉంటాయి.. జనాలకు నచ్చనివి కొన్ని ఉంటాయి. జనాలకు నచ్చిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మంచి మెసేజ్ ను అందిస్తాయి. మరికొన్ని టైమ్ పాస్ వీడియోలు ఉంటాయి. మరికొన్ని స్టంట్ వీడియోలు ఉంటాయి. స్టంట్స్ అంటనే అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే.. స్టంట్స్ పేరుతో చాలామంది గాయాలపాలవుతుంటారు. ఒక్కోసారి అవ్వే ప్రమాదాన్ని తీసుకొస్తాయి. అందుకే స్టంట్స్ విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉంటారు.

కానీ.. కొన్ని స్టంట్స్ మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. కొన్ని స్టంట్స్ ఒక్కోసారి ఫెయిల్ కూడా అవుతుంటాయి. అలా ఫెయిల్ అయిన స్టంట్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా వైరల్ అయిన వీడియోల్లో ఇది ఒకటి.
Viral Video : అట్టర్ ప్లాఫ్ అయిన సైకిల్ స్టంట్
సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ క్లిప్ ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డుపై పడుకొని ఉంటాడు. ఇంతలో సైకిల్ మీద ఓ వ్యక్తి వేగంగా దూసుకొస్తాడు. పడుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి తన సైకిల్ ను ఆ వ్యక్తి ఆపేస్తాడు అని అందరూ అనుకుంటారు. కానీ… సైకిల్ ను డైరెక్ట్ గా తీసుకెళ్లి పడుకున్న వ్యక్తిని ఢీకొడతాడు. దీంతో సైకిల్ మీద నుంచి ఆ వ్యక్తి కింద పడతాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు అవుతాయి.
— The Darwin Awards (@AwardsDarwin_) August 8, 2022
ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. అవసరమా ఇలాంటి స్టంట్స్ అవసరమా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రాణం చాలా విలువైనది. ఇలాంటి పనికిమాలిన స్టంట్స్ చేసి గాయాలపాలు ఎందుకు అవుతారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.