Viral Video : ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. అందులో జంతువులు ,పక్షులు ఇంకా అమ్మాయిలు డాన్సులు చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో కొన్ని భయభ్రాంతులను కలిగించేలా ఉంటే ,మారికొన్ని ఆశ్చర్యపరిచేలా ,నవ్వించేవిగా ఉంటాయి. అయితే జంతువుల్లో ప్రత్యేకమైనటువంటి కోతులు ఇవి చేసే పనులకు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే వీడియోలో కోతి చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరూ భయంతో వణికి పోవాల్సిందే.
Viral Video : పిల్లాడిని పగ పట్టిన కోతి
విషయానికొస్తే కోతి బాలుడు మీద పగబట్టి ఏటాచ్ చేస్తున్న ఈ వీడియోని కొందరు షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మొదటగా పిల్లలందరూ ఒక ప్రాంగణంలో ఆడుకుంటూ ఉంటారు. ముందుగా కోతి అక్కడికి రాగానే పిల్లలందరూ భయానికి గురై పారిపోతారు. అయితే ఒక పిల్లాడు ఆ కోతికి దొరకగా ఆ పిల్లాడిని గట్టిగా పట్టుకొని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఆ పిల్లాడి తల్లి ధైర్యంతో ఆ పిల్లాడిని కోతి నుండి విడిపించడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ కోతి ఏమాత్రం దడవకుండా ఆమె దగ్గర నుండి ఆ పిల్లాడిని లాక్కుంటూ ఉంది.

కానీ తల్లి ఆ పిల్లాడిని కోతి నుండి విడిపించినప్పటికీ పదేపదే ఆ పిల్లాడిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పిల్లాడి తండ్రి కూడా ఆ కోతిని తెరమడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ పిల్లాడిని గట్టిగా పట్టుకొని లాగుతూ పగ పట్టిన దానిలా ప్రవర్తించింది. చివరికి తల్లిదండ్రులు ఇద్దరు ఆ కోతి శర నుంచి పిల్లాడిని కాపాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోని చూసిన నటిజెన్లు ఆ కోతి చేసిన పనికి ఆశ్చర్యానికి గురవుతూ ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే వీడియో చూడడానికి భయంకరంగా ఉంది.
Monkey tries to kidnap baby. You can’t tell me that monkey is not demonic. pic.twitter.com/Sp8OtwgpTT
— Vule (@Stallie10) August 19, 2022