Viral Video : కోతి చేష్టలని ఊరికే అన్నారా .. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు ..??

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీక్షణాల్లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా నెట్టింట్లో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో జనాలను బాగా ఆకర్షించింది. ఈ వీడియోలో ఓ కోతి చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు. ఇక కోతి చేసే పనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి చేసే పనుల వలన ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. సరదాగా కనిపించే ఎన్నో సంఘటనలతో ప్రమాదాన్ని వెంటపెట్టుకొస్తుంది. అసలు విషయంలోకి వెళితే ఓ కోతి పడగవిప్పి బుసలు కొడుతున్న పాము దగ్గరికి వెళ్ళింది. దాని తోకను పట్టుకొని పదే పదే లాగింది. ఆమెకు కోతికి మధ్య జరిగిన సంఘటన చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Advertisement

పొలంలో ఒక పాము పడగ విప్పి బుసలు కొడుతుంది. దాని ఎదురుగా ఒక కోతి కూర్చుని ఉంది. అది పాము తోకను పట్టుకొని లాగుతుంది. పాము ఊరుకుంటుందా మరి కాటేయడానికి వెళ్ళగా కోతి తప్పించుకొని వెనక్కి వెళుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆ కోతి ముందుకు వెళ్లి పాము తోక పట్టుకొని జరజరా లాక్కుపోయింది. దీంతో పాము మళ్ళీ కోతిని కాటు వేయడానికి ప్రయత్నించింది. అయినా ఈసారి కూడా అది తప్పించుకొని అందనంత దూరాన వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ కోతి పాము తోక పట్టుకోవడానికి ముందు వస్తుండగా ఈ వీడియో అక్కడికి ముగుస్తుంది. చివరకు ఆ వీడియోలో పాము కోతిని కాటేసిందా లేదా ఇంకేమైనా జరిగిందా అనేది తెలియదు.

Advertisement
Monkey play with snake viral video
Monkey play with snake viral video

ఈ వీడియోను ఒక వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు కోతి చేసిన పనికి మండిపడుతున్నారు. పాముతో చెలగాటం ఆడడం అంటే మన ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అని అంటున్నారు. కోతి తను చావుని ఆహ్వానిస్తుందని మరికొందరు కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షల్లో చూశారు. వేలల్లో లైక్స్ వచ్చాయి. కానీ చివరి వరకు వీడియో చూపిస్తే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement