Viral Video : ట్రాఫిక్ వ్యవస్థను సెట్ చేయడానికి పోలీసులు ఎంతో కష్టపడుతుంటారు. ట్రాఫిక్ పోలీసులు 24 గంటలు రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుంటారు. రోడ్డు మీద ట్రాఫిక్ కాకుండా ఉండేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. నో పార్కింగ్ బోర్డ్స్ ను ఏర్పాటు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరు నో పార్కింగ్ ప్లేస్ లో బైక్ లను, కార్లను పార్క్ చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు అటువంటి వాహనాలకు ఫైన్ వేయడంతో పాటు ఒక్కోసారి ఆ వాహనాలను సీజ్ చేస్తుంటారు.

పబ్లిక్ కు ఇబ్బంది కాకుండా ఉండేందుకు అక్కడ పార్క్ చేసే వాహనాలను సీజ్ చేస్తుంటారు పోలీసులు. ఒక్కోసారి వాహనాలను సీజ్ చేస్తే వాహన యజమానులు పోలీసులపై ఎదురు తిరుగుతారు. రచ్చ రచ్చ చేస్తారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Viral Video : పోలీసులు సీజ్ చేసినా స్కూటర్ ను వదలని వ్యక్తి
నాగ్ పూర్ లోని సదర్ బజార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నో పార్కింగ్ ప్లేస్ లో ఓ వ్యక్తి స్కూటీని పార్క్ చేశాడు. అక్కడికి వచ్చిన పోలీసులు.. నో పార్కింగ్ ప్లేస్ లో ఎలా పార్క్ చేస్తావని స్కూటీని సీజ్ చేశారు. క్రేన్ సాయంతో స్టేషన్ కు దాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన స్కూటీ యజమాని.. దాన్ని వదల్లేదు. దాని మీద ఉన్న ప్రేమతో స్కూటీ మీద అలాగే కూర్చొన్నాడు. అయినా కూడా ఆ స్కూటీని ట్రాఫిక్ పోలీసులు వదిలేయలేదు. ఆ వ్యక్తి అలాగే కూర్చొన్నా క్రేన్ తో దాన్ని అలాగే గాల్లోకి లేపారు. ఈ ఘటనను చూసిన అక్కడి స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే తమ ఫోన్ లోని కెమెరాలకు పని చెప్పారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. స్కూటీ మీద కూర్చొన్నా పోలీసులు వదల్లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram