Viral Video : రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన రైల్వే పోలీసులు

Viral Video : ట్రెయిన్ జర్నీ అనేది చాలా సులభమైన, అలవాటైన జర్నీ. అందుకే చాలా మంది ప్రయాణాల్లో రైళ్లనే ప్రిఫర్ చేస్తుంటారు. ట్రెయిన్ లో ఉన్నంత సేపు ఎటువంటి సమస్య ఉండదు కానీ.. ట్రెయిన్ జర్నీలో భయంకరమైన విషయం ఏంటంటే.. ట్రెయిన్ కదులుతున్నప్పుడు ఎక్కడం, దిగడం. చాలామంది ట్రెయిన్ బయలుదేరాక.. ఎక్కడానికి ప్రయత్నిస్తారు. లేదా దిగడానికి ప్రయత్నిస్తారు. దాని వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు.

Advertisement
passenger got stuck in a gap between train and platform video viral
passenger got stuck in a gap between train and platform video viral

అలా.. కదులుతున్న రైళ్లు ఎక్కబోయి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాలపాలయ్యారు. ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో ట్రెయిన్ ఆగినప్పుడు.. ప్లాట్ ఫామ్ మీద దిగడం, అది కదలడం చూసుకోక తొందరలో ఎక్కుతూ కిందపడటం, లేట్ గా స్టేషన్ కు వచ్చి రైలు బయలుదేరుతుంటే ఆతృతగా ఎక్కడానికి ప్రయత్నించడం.. ఇలా పలు సందర్భాల్లో ప్రయాణికులు రైలు, ప్లాట్ ఫామ్ మధ్య పడిపోయి చిక్కుకుపోతారు. కొందరు పడబోతుండగా అక్కడే ఉండే రైల్వే పోలీసులు కానీ.. లేదా ఎవరైనా ఇతర ప్రయాణికులు కానీ వాళ్లను కాపాడటానికి ప్రయత్నిస్తారు.

Advertisement

Viral Video : వ్యక్తి ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసులకు ప్రశంసలు

కోయంబత్తూరు రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైలు కదులుతుండగా ఎక్కబోయి రైలు, ప్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయాడు. వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ పోలీసులు అరుణ్ జిత్, పీపీ మిని ఇద్దరూ ఆ వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడారు. రైలు కదులుతుండగానే అతడు ప్లాట్ ఫామ్ మధ్యలో చిక్కుకుపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. చివరకు అతడి ప్రాణాలు కాపాడగలిగారు. ఈ ఘటన స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ప్రాణాలకు తెగించి ప్రయాణికుడిని కాపాడిన పోలీసులను పలువురు ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement