Viral Video : ఇది కదా రైతు క్రియేటివిటీ అంటే.. ఎద్దులతో కరెంట్ ను ఎలా ఉత్పత్తి చేస్తున్నారో తెలిస్తే దిమ్మతిరుగుతుంది

Viral Video : మనది రైతు దేశం. వ్యవసాయమే ప్రధాన జీవనంగా బతుకుతున్నారు ప్రజలు. వ్యవసాయంలో ఇప్పటి వరకు ఎన్నో కొత్త పద్ధతులను కనిపెట్టారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు చాలామంది ఎన్నోవిధాలుగా ప్రయత్నించారు. ఏది ఏమైనా.. వ్యవసాయానికి సంబంధించిన కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడంతో మన దేశ రైతుల తర్వాతనే ఎవరైనా. మన రైతులు ఎంతో కష్టపడేతత్వం గలవారు. అందుకే వాళ్ల ఆలోచనలను ఆచరణలో పెట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు.

Advertisement
power producing with bull in rural areas video viral
power producing with bull in rural areas video viral

తాజాగా ఓ రైతు చేసిన ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు క్రియేటివిటీకి హేట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఒక యంత్రాన్ని తయారు చేసి ఎద్దుతో దాన్ని నడిపిస్తూ పంటకు కావాల్సిన నీటిని తోడుతున్నారు. నిజంగా అదో అద్భుతమైన ఆవిష్కరణ. కరెంట్ అవసరం లేకుండా.. కరెంట్ వాడకుండా.. బోరు లోపల నుంచి, బావి లోపల నుంచి నీటిని తోడుతున్నారు.

Advertisement

Viral Video : మోటర్లు పెట్టి కరెంట్ ను ఉత్పత్తి చేస్తున్న రైతులు

రైతుల క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వ్యవసాయం కోసం పంట కోసం నీళ్లను పైకి తీసుకొచ్చేలా యంత్రాన్ని తయారు చేసి.. ఎద్దును మీద నిలబెట్టి దానితో నీళ్లు పైకి తెచ్చి.. మోటర్ల సాయంతో ఆ నీటి నుంచి కరెంట్ ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అలా ఉత్పత్తి చేసిన కరెంట్ ను తిరిగి వ్యవసాయం కోసమే వాడుతున్నారు. వీళ్ల ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇది ఇండియాలోనే కానీ.. ఎక్కడ జరిగిందో మాత్రం నెటిజన్లు గుర్తించలేకపోతున్నారు. మొత్తానికి రైతే దేశానికి వెన్నుముక అనే నానుడిని వీళ్లు నిజం చేశారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా రైతుకు హేట్సాఫ్ అంటారు.

Advertisement