Viral Video : ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్.. అంటే అవసరానికి ఆదుకున్న స్నేహితుడే నిజమైన స్నేహితుడు అని అర్థం. అవసరానికి రాని వాడు.. అవసరానికి ఆదుకోని వాడు అసలు ఫ్రెండే కాదు.. అటువంటి వాళ్లతో స్నేహం చేయడం కూడా వేస్ట్ అని దాని అర్థం. పెద్దలు కూడా అదే చెబుతుంటారు. అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్లడం కాదు.. ఫ్రెండ్ అవసరంలో ఉన్నప్పుడు అతడి దగ్గరికి వెళ్లడం అనేది నిజమైన ఫ్రెండ్ షిప్.

అయితే.. అందరూ అలా ఉండరు. కొందరు ఫ్రెండ్ షిప్ కోసం ప్రాణం ఇస్తారు. అలాంటి ఎన్నో ఘటనలను మనం చూశాం. మనుషుల్లో అలాంటి వాళ్లు ఉంటారంటే ఓకే కానీ.. జంతువుల్లోనూ అటువంటి ఫ్రెండ్ షిప్ ఉంటుందా అంటే ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ వీడియో చూశాక ఇదిరా నిజమైన ఫ్రెండ్ షిప్ అని శెభాష్ అంటారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం రండి.
Viral Video : తన ఫ్రెండ్ కంగారు కోసం తెగ కంగారు పడ్డ కంగారు
ఓ కంగారును కొండ చెలువ పట్టేసింది. అస్సలు వదలడం లేదు. అది ఎంత విదుల్చుకుందామన్నా అస్సలు అది తనను వదల్లేదు. దీంతో ఆ కంగారుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ఆ కంగారు ఫ్రెండ్ మరో కంగారు వచ్చి దాన్ని విదిల్చేందుకు తెగ ప్రయత్నించింది. ఆ కొండ చిలువ కంగారును మొత్తం చుట్టేసి అస్సలు వదలకపోవడంతో ఆ కొండ చిలువతో ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. అయినా ఆ కొండ చిలువ దాన్ని వదల్లేదు. ఇంకా గట్టిగా ఆ కంగారును కొండ చిలువ పట్టేయడంతో ఊపిరి ఆడక.. ఆ కంగారు హార్ట్ ఎటాక్ తో చనిపోయిందట. కానీ.. తన ఫ్రెండ్ ను కాపాడుకోవడం కోసం ఇంకో కంగారు పడ్డ తపనను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిరా నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram