RRR : అమ్మ రాజమౌళి.. ఎంత మోసం చేశావు.. కొమురం భీముడో సాంగ్ లో అసలు జనాలే లేరా? వీడియో వైరల్

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. అవును.. అది ఒక కళాఖండం. ఆ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాహుబలి సిరీస్ ను మించిన రెస్పాన్స్ ఆ సినిమాకు వస్తుంది. ఏ దేశంలో చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చ. దర్శకేంద్రుడు రాజమౌళి సినిమా తీశాడంటే.. అది మామూలుగా ఉండదు కదా. కొన్ని సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి.. సీన్ టు సీన్ ను జతచేసి.. ఒక అద్భుతమైన సినిమాను తీస్తాడు జక్కన్న. పరీక్షించి చూస్తే.. సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను మెస్ మరైజ్ చేస్తుంది. అదే జక్కన్న టాలెంట్. అందుకే.. ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి చరిత్రకెక్కాడు.

Advertisement
rrr komuram bheemudo vfx break down video viral,
rrr komuram bheemudo vfx break down video viral,

పాన్ ఇండియా అనడం కన్నా.. ఆర్ఆర్ఆర్ ను పాన్ వరల్డ్ సినిమా అనాలి. ఇక నుంచి రాజమౌళి తీసే సినిమాలు అన్నీ పాన్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. అది ఏ వీడియో అంటే.. ఆర్ఆర్ఆర్ లో అందరినీ కంటతడి పెట్టించిన కొమురం భీముడో అనే పాట.

Advertisement

RRR : ఆ పాట మొత్తం గ్రాఫిక్సేనట

కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ ను రామ్ చరణ్ ఎలా చితకబాదుతాడో అందరికీ తెలుసు. లక్షల మంది జనాల ముందు నడి రోడ్డు మీద ఎన్టీఆర్ ను కట్టేసి రక్తం కారేలా కొట్టే సీన్ చూసి ప్రేక్షకులే చలించిపోయారు. కొమురం భీముడో అంటూ ఎన్టీఆర్ పాడిన పాట.. అక్కడ ఉన్న లక్షలాది జనాల్లో ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది. వాళ్ల కోపం కట్టలు తెంచుకునేలా చేస్తుంది. తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే గొప్ప లక్షణం ఎన్టీఆర్ లో ఉందని రామ్ చరణ్ కూడా అప్పుడే గ్రహిస్తాడు.

అయితే.. ఆ పాటలో అసలు అక్కడ అంతమంది జనాలే లేరట. అక్కడ ఉన్న జనాలందరూ గ్రాఫిక్సేనట. ఆ పాటకు గ్రాఫిక్స్ చేసింది మకుట టీమ్. వాళ్లే ఈ పాటకు వీఎఫ్ఎక్స్ చేశారు. కొమురం భీముడో పాట వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ అంటూ ఓ వీడియోను తాజాగా యూట్యూబ్ లో మకుట టీమ్ వదిలింది. ఆ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమ్మ రాజమౌళి.. జనాలను భలే మోసం చేశావు కదా..అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేసినా.. మరికొందరు మాత్రం వావ్.. పర్ ఫెక్ట్.. ఎంత బాగా వీఎఫ్ఎక్స్ చేశారు అంటూ రాజమౌళి, మకుట టీమ్ ను మెచ్చుకుంటున్నారు.

Advertisement