Viral Video : వీడు పిల్లోడు కాదు చిచ్చరపిడుగు…క్రూర జంతువులతో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి…

Viral Video  : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక దానిలో కొందరు చేసే వివిధ పనులు నేటి జనులను ఆకట్టుకునేలా ,ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెంపుడు జంతువులు మరియు అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటిదే ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఓ పిల్లాడు బొమ్మలతో ఆడుకుంటున్నట్లుగా ప్రమాదకరమైన జంతువులతో ఆడుకుంటున్నాడు.

Advertisement

దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వీడియోను @nounman.hassan1 అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయడం జరిగింది. అయితే పిల్లలు అంటే బొమ్మలతో ఆడుకుంటూ సరదాగా గడుపుతుంటారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లోడు మాత్రం ఏకంగా విషపూరితమైన పాము మరియు ఎంతో ప్రమాదకరమైన మొసలితో ఆడుకుంటున్నాడు.

Advertisement

నిజం చెప్పాలంటే వీటిని చూస్తేనే మనం ఆమడ దూరం పరుగులు తీస్తాము కానీ ఈ పిల్లోడు మాత్రం కొండచిలువను మెడలో వేసుకొని మొసలి పిల్లను ఒళ్ళో పెట్టుకుని ఆడుకుంటున్నాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు వీడు పిల్లోడు కాదు చిచ్చరపిడుగు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఎంత పెంపుడు జంతువులైనప్పటికీ వాటితో మరీ అంత చనువుగా ఉండటం మంచిది కాదు అంటూ హెచ్చరిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nouman Hassan (@nouman.hassan1)

Advertisement