Viral Video : వామ్మో.. గొర్రెలు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాయా? ఈ చిన్నారిని గొర్రెపోతు ఏం చేసిందో చూడండి

Viral Video : గొర్రె మాంసానికి ఉండే డిమాండే వేరు. మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని అన్ని దేశాల్లో గొర్రెమాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం మాంసం కోసమే కొన్ని గొర్రెలు, గొర్రెపోతులను పెంచుతుంటారు. మరి కొన్ని గొర్రెలను ఉన్ని కోసం పెంచుతుంటారు. కానీ.. మన దగ్గర మాత్రం గొర్రెలు, మేకలను కేవలం మాంసం కోసమే పెంచుతారు. గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ చూసినా గొర్రెలు కనిపిస్తుంటాయి. కానీ.. అవి చాలా సాధు జంతువులు. ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టవు. అవి కసాయిలనే నమ్ముతాయి.

Advertisement
sheep attacks child video goes viral
sheep attacks child video goes viral

ఊళ్లలో ఉండేవాళ్లు వ్యవసాయం ఆధారంగా బతికే వాళ్లు ఖచ్చితంగా ఆవులు, బర్రెలతో పాటు గొర్రెలు, మేకలను కూడా పెంచుకుంటారు. కానీ.. గొర్రెలు, మేకల వల్ల ఎప్పుడూ ఎలాంటి అపాయం మాత్రం ఎవ్వరికీ కలగలేదు. కానీ.. ఈ వీడియో చూస్తే మాత్రం వామ్మో అని నోరెళ్లెబెడతారు. గొర్రెలకు ఇంత సీన్ ఉందా? గొర్రెలు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాయా అని అనుకుంటారు.

Advertisement

Viral Video : కొమ్ములతో చిన్నారిపై దాడి చేసిన గొర్రెపోతు

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది ఓ గొర్రెపోతు కు సంబంధించిన వీడియో. గొర్రెల మంద లోపలికి ఓ చిన్నారి దారి తప్పి వెళ్తుంది. అందులోకి వెళ్లాక ఎలా రావాలో ఆ చిన్నారికి అర్థం కాదు. దీంతో ఒక చోట గొర్రెల మందకు దూరంగా నిలబడి ఉంటుంది. ఇంతలో గొర్రెల మందలో ఓ గొర్రెపోతు ఆ చిన్నారిని చూసి ఆ చిన్నారిపై దాడి చేసింది. తన కొమ్ములతో ఆ చిన్నారిపై దూసుకెళ్లింది. పలు మార్లు ఆ చిన్నారిని తన కొమ్ములతో డీకొట్టింది. ఆ చిన్నారి భయపడి అరవడంతో వెంటనే ఓ వ్యక్తి వచ్చి ఆ చిన్నారిని ఆ గొర్రెపోతు బారి నుంచి కాపాడబోయాడు. అయినా కూడా ఆ గొర్రెపోతు మాత్రం ఆగలేదు. ఆ చిన్నారిపై దాడి చేస్తూనే ఉంది. ఇంతలో మరో మహిళ వచ్చి ఆ గొర్రెపోతును రాయితో కొట్టడంతో అప్పుడు అది శాంతించింది. ఆ తర్వాత ఆ చిన్నారిని రక్షించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారికి ఏవైనా గాయాలు అయ్యాయా అనేది తెలియదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కూడా తెలియదు కానీ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. ఇదేం గొర్రెరా బాబోయ్.. ఇంత క్రూరంగా ప్రవర్తిస్తోంది. వెంటనే దాన్ని కోసుకొని తినేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement