Viral Video : సాధారణంగా సింహాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు. ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా సింహానికి ఎదురు వెళ్ళినా మన రిస్క్ మనకు సింహం ఎదురొచ్చినా మనకే రిస్క్. అన్నట్లుగా సింహాన్ని చూస్తే ఎంతటి వారైనా భయపడాల్సిందే. సింహం గర్జన చప్పుడు వినిపిస్తేనే అందరికీ సుస్సు పడిపోతుంది. సింహం గర్జన దాదాపు ఐదు మైళ్ళ వరకు వినిపిస్తుంది. సింహం గర్జిని అంత భయంకరంగా ఉంటుంది. ఆ గర్జన వింటే అడవిలో జంతువులన్నీ ఎక్కడివి అక్కడే పారిపోతాయి. అటువంటి సింహానికి ఓ అడవి దున్న చుక్కలు చూపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఈ వీడియోలో మొదట సింహం అడవి దున్నల మందలోని ఒక గేదెను వేటాడుతూ పట్టుకుంటుంది. అది చూసిన ఆ మందలోని ఒక దున్న సింహం దగ్గరగా వెళ్లి తన కొమ్ములతో గాల్లోనే ఎగరవేస్తూ వీర కుమ్ముడు కుమ్ముతుంది. సింహాన్ని దాదాపు మూడు నాలుగు సార్లు గాలిలో తిప్పి గిరాటు వేస్తుంది. ఇలా జరగగానే అడవి దున్నదాటికి సింహానికి చుక్కలు కనపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులను అలరించింది.

సింహాన్ని అడవి దున్న కుమ్మేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త సెన్సేషనల్ గా మారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సింహం పై అడవి దున్న చేసిన సాహసానికి ఇది చూసిన మెటిజెన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తూ అడవిదిన్నె యొక్క ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఎంత పెద్ద జంతువైనప్పటికీ అడవితున్న ఆత్మధైర్యానికి ఇంకా ఆత్మవిశ్వాసానికి అందరూ ఫిదా అయిపోయారు. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.
View this post on Instagram