Sri Reddy : శ్రీ రెడ్డి ఎప్పుడూ వివాదాలతో నేటింట ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కొత్త వంటకాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. పల్లెటూరి స్ట్రీగా కట్టుబొట్టులు మార్చి ఈ భాషలో మాట్లాడుతూ అనేక రకాల వంటకాలను చేసి రుచి చూపిస్తుంది. శ్రీ రెడ్డి వంటకాలను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా వీలుంటే శ్రీరెడ్డి చేతి వంటకాలను కావలనీ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా శ్రీ రెడ్డి వంటకాలు చేసే స్టైల్ మారిపోయింది. ఒకవైపు నీతి సూక్తులు చెబుతూ మరోవైపు వెరైటీ వంటలు చేస్తుంది.
శ్రీరెడ్డి పిల్లలను పెంచే పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది. చిన్నపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది పిల్లల్ని చదువు విషయంలో ఒత్తిడికి గురి చేయవద్దు అని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా స్త్రీలు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఒంటినిండా బట్టలు ధరించులని వివరించింది. చిన్నపిల్లని తిట్టడం ,కొట్టడం అలాంటి పనులు చేయొద్దని మన పెంపకమే మనల్ని తిరిగి కాపాడుతుందని వివిధ రకాల సూక్తులు చెప్పింది. శ్రీ రెడ్డి ఎప్పుడూ యూట్యూబ్ ద్వారా వినోదాన్ని భలేగా పంచుతుంది. అంతేకాక శ్రీరెడ్డికి డేర్ చాలా ఎక్కువ.
Sri Reddy : నీతి సుక్తులు కూడా బాగానే వడ్డించింది….

ఏదో మాటల్లో చెప్పడమే కాకుండా తన చేతలతో కూడా ఒక్కొక్కసారి ఫైర్ అవుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. తెలుగులో సినిమాలు అవకాశం రాని టైంలో తాను పడ్డ బాధను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రభంజనం సృష్టించింది. తన మాటలతో చేతులతో ఇండస్ట్రీలో ప్రముఖుల అందరికీ చుక్కలు చూపించింది. ఫిలిం ఛాంబర్ దగ్గర తను చేసిన ప్రదర్శనకు శ్రీ రెడ్డి ఒక్కసారిగా లిమ్ లైట్ లోకి వచ్చేసింది. ఈమె చేసిన ఈ నిరసనకు గాను ఇండస్ట్రీ మొత్తం మారుమోగిపోయింది.