Viral Video : స్కూల్స్, కాలేజీలలో విద్యార్థుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. ఏదో ఒక విషయంపై గొడవపడి ఒకరినొకరు కొట్టుకోవడం అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల మధ్య ఇలాంటి ఘర్షణలు ఎక్కువగా జరుగుతుంటాయి. సీనియర్ జూనియర్ అని , బీటెక్ , ఫార్మసీ కాలేజ్ అని గ్రూపులుగా కొట్టుకోవడం కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.అంతేకాక కొందరు అమ్మాయిల విషయంపై కూడా గొడవలు పడుతుంటారు . అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు స్కూల్ విద్యార్థులు కొట్టుకోవడం మనం గమనించవచ్చు. అయితే అమ్మాయి కోసం వారు అలా గొడవ పడడం , అంతల దిగజారడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత చిన్న వయసులోనే వీరిద్దరి ప్రవర్తన అందర్నీ షాక్ గురిచేసింది. అయితే ఈ వీడియోను @gharkekalesh అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ వేసుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇక వారందరిలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు కొట్టుకోసాగారు . ఒకరిపై ఒకరు పిడు గుద్దులు గుద్దుకుంటూ రెచ్చిపోయారు.
ఈ క్రమంలో కొందరు వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. అయితే ఆ ఇద్దరి విద్యార్థుల మధ్య ఘర్షణ రావడానికి గల కారణం ఓ అమ్మాయట. ఇక అమ్మాయి కోసం వారిద్దరు గొడవ పడుతున్నట్లుగా వీడియో షేర్ చేసిన వారు క్యాప్షన్ గా రాసుకోవచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇప్పటివరకు ఈ వీడియోను 40 వేల మంది చూడగా నేటిజనులు తమదైన శైలి లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులోనే అమ్మాయిల కోసం గొడవనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే…సినిమాల ప్రభావం విద్యార్థులపై చిన్న వయసులోనే పడుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Kalesh b/w KV bois over girl issues pic.twitter.com/fr3vpI6uq8
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 8, 2023