Viral Video : వాళ్లంతా ఇంటర్ మీడియెట్ చదివే విద్యార్థులు. కో ఎడ్యుకేషనల్ కాలేజీ అది. అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కలిసి చదువుకునే కాలేజీ అది. తిప్పి తిప్పి కొడితే వాళ్ల వయసు 16 నుంచి 18 లోపే. కానీ.. వాళ్లు చాలా అడ్వాన్స్ అయిపోయారు. పెరుగుతున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ఇప్పుడు నేటి యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. వాటి మాయలో పడి చదువును గాలికి వదిలేసి హద్దులు మీరుతున్నారు. క్లాస్ రూమ్ లోనే లిమిట్ క్రాస్ చేస్తున్నారు.

ఒకప్పుడు చదువు వేరు.. ఇప్పటి చదువు వేరు. ఒకప్పుడు అమ్మాయిలతో మాట్లాడాలంటేనే అబ్బాయిలు భయపడేవాళ్లు. టీచర్లకు కూడా భయపడేవాళ్లు. కానీ.. ఇప్పుడు టీచర్లకు భయపడేవాళ్లే లేరు. తాజాగా క్లాస్ రూమ్ లోనే అబ్బాయిలు, అమ్మాయిలు హద్దు మీరి ప్రవర్తించారు. క్లాస్ రూమ్ లో ఉన్నాం అనే విషయాన్ని కూడా మరిచిపోయి రొమాన్స్ చేసుకున్నారు. ఒకరిని మరొకరు కౌగిలించుకోవడం, వింత చేష్టలు చేయడం చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?
అస్సాం రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిల్చార్ లోని రామానుజ్ గుప్తా కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కొందరు అబ్బాయిలు.. అమ్మాయిలు క్లాస్ రూమ్ లోనే వెకిలి చేష్టలు చేయడాన్ని కాలేజీ టీచర్లు గుర్తించారు. వాళ్లకు మేనేజ్ మెంట్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
కానీ.. ఇంతలో వాళ్ల చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ విద్యార్థులను కాలేజీ సస్పెండ్ చేసింది. అందులో ముగ్గురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ఉన్నారు.
కాలేజీ టీచర్లు ఎవ్వరూ లేని సమయంలో టిఫిన్ చేసే ప్లేస్ లో స్టూడెంట్స్ ఇలాంటి చేష్టలకు పాల్పడ్డారు. కాలేజీ ఆవరణలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మొబైల్స్ ను కూడా కాలేజీలోనికి రానివ్వం. ఈ విద్యార్థులు అంతా కొత్త బ్యాచ్. ఇటీవలే కాలేజీలో చేరారు. ఇంతలోనే వాళ్లు ఇలాంటి చేష్టలకు పాల్పడ్డారు.. అని కాలేజీ ప్రిన్సిపల్ పూర్ణదీప్ చందా తెలిపారు.