Viral Video : దొంగలు కూడా అప్ డేట్ అయ్యారు బాస్. మామూలుగా కాదు. ఒకప్పుడు దొంగతనాలు అంటే చాలా ట్రెడిషనల్ గా జరిగేవి. దొంగలు అంటే భయంకరంగా ఉండేవారు. దొంగలను చూస్తేనే ఉచ్చపడేది. కానీ.. జనరేషన్ మారింది. ఇప్పటి జనరేషన్ దొంగలు చాలా స్మార్ట్. మామూలు స్మార్ట్ కాదండోయ్. ఈ దొంగ తెలివి చూస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు.

ఈ వీడియో చూశాక.. ఆ దొంగ తెలివిని మీరు మెచ్చుకోకుండా ఉండలేరు. ఆ దొంగకు మీరు హేట్సాఫ్ చెబుతారు. అబ్బా.. అంతలా ఆ దొంగను పొగుడుతున్నావు.. ఇంతకీ ఆ దొంగ ఏం దొంగతనం చేశాడు అని అంటారా? మీరే ఆశ్చర్యపోతారు.. ఆ దొంగ చేసిన దొంగతనం చూసి.
Viral Video : భలేగా స్కెచ్ వేసి ఫోన్ కొట్టేశాడు
అది రైల్వే గేట్. ట్రెయిన్ వచ్చే సమయం ఆసన్నమైంది. గేట్ పడటంతో అందరూ అక్కడ ఆగారు. ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి బైక్ ఆపి.. ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి ఓ వ్యక్తి ట్రాక్ క్రాస్ చేసి వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. ఫోన్ లాక్కున్నాడు. వెంటనే ట్రాక్ క్రాస్ చేశాడు. అప్పుడే ట్రెయిన్ వస్తోంది. ఆ వ్యక్తి బైక్ దిగి అతడిని పట్టుకుందామనుకునేలోపే.. ట్రెయిన్ వేగంగా వెళ్లడంతో ఆ వ్యక్తి ఇటు వైపు ఆగిపోయాడు. దొంగ అటువైపు పరిగెత్తుకువెళ్లిపోయాడు. ఫోన్ పోవడంతో ఏం చేయాలో ఆ వ్యక్తికి అర్థ కాలేదు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The brainiest people in India are Rocket Scientists & these guys: pic.twitter.com/XzGLMEU4Xl
— Gabbbar (@GabbbarSingh) August 17, 2022