Viral Video : జనాలు గొర్రెలు అని చెప్పడానికి మరో ఉదాహరణ ఈ ఘటన. రైల్వే క్రాసింగ్ వద్ద.. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా ప్రాణాలకే ప్రమాదం అని ఎంత చెప్పినా జనాలు వినరు. ఒక ఐదు నిమిషాలు క్రాసింగ్ వద్ద వెయిట్ చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు కొందరు. రైల్వే గేట్ పడ్డా కూడా దాని కింది నుంచి నడుచుకుంటూ వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. బైక్ మీద వెళ్లే వాళ్లు కూడా బైక్ ను కిందికి వంచి గేట్ కింది నుంచి వెళ్తుంటారు. ఇది చాలా డేంజర్ అని తెలిసి కూడా తమ ప్రాణాలనే కొందరు పణంగా పెడుతుంటారు.

ఇలా రైల్వే గేట్ పడ్డా కూడా దాటి వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లను చూసి కూడా కొందరికి కనువిప్పు కలగడం లేదు. ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు.. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదని తెలిసి కూడా ప్రాణాలతో ఆటలాడుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఇటావా అనే ప్రాంతంలో ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఘటనను చూసి అందరూ భయపడిపోతున్నారు.
Viral Video : క్షణాల్లో ప్రాణాలను తప్పించుకున్న వ్యక్తి
ఇటావాకు చెందిన ఓ వ్యక్తి రైల్వే గేట్ వేసి ఉన్నా రైల్వే ట్రాక్ ను దాటేందుకు ప్రయత్నించాడు. అతడొక్కడే కాదు.. చాలామంది బైక్ లతో ట్రాక్ ను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో రైలు వెళ్తుంటే వేరే ట్రాక్ మీద అందరూ ఆగారు. కానీ.. ఆ ట్రాక్ మీది నుంచి ఎదురుగా మరో రైలు వస్తుందని వాళ్లు ఊహించలేదు. ఇంతలో హారన్ కొడుతూ మరో రైలు వస్తోంది. దీంతో అందరూ తమ బండ్లను వెనక్కి తిప్పారు. ఆ బైకర్ కూడా తన బైక్ ను వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా ట్రాక్ పట్టా వద్ద తన బైక్ టైర్ చిక్కుపోతుంది.
WATCH – Commuter's bike gets stuck on railway crossing track in Etawah, blown to pieces by passing train. #ViralVideo pic.twitter.com/WQ3O8NXIxV
— TIMES NOW (@TimesNow) August 29, 2022
ఓవైపు రైలు దూసుకువస్తోంది. ఏం చేయాలో అతడికి అర్థం కావడం లేదు. బైక్ ను కింద పడేసి.. బైక్ ను వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. కానీ.. బైక్ ను వెనక్కి లాగలేకపోయాడు. ఇంతలో రైలు వేగంగా దూసుకురావడంతో ఆ బైక్ ను అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తాడు. ఇంతలో రైలు వేగంగా వచ్చి ఆ బైక్ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ బైక్ తుక్కు తుక్కు అయిపోయింది.
ఈ ఘటన ఆగస్టు 26 న చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత చెప్పినా వీళ్లకు అర్థం కాదా? ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేరా? ఎందుకు ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు.. అంటూ నెటిజన్లు ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు.