Viral Video : సాహసాలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ.. ఎంతమంది సాహసాలు చేస్తారు. సాహసం చేస్తే అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. కానీ సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. గాయాలపాలు అయిన వాళ్లు కూడా ఉన్నారు. కొందరికి ఎత్తైన పర్వతాలు ఎక్కాలని ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలని ఉంటుంది. సముద్రంలో ప్రయాణం చేయాలని మరికొందరికి ఉంటుంది.

ఇలా చాలామందికి ఎన్నో రకాలు సాహసాలు చేయాలని ఉంటుంది. కానీ.. కొందరు సాహసానికి ఒడిగడతారు.. కొందరు ఒడిగట్టరు. కొందరైతే ఆకాశంలో విహరించాలని అనుకుంటారు. దాని కోసం విమానం, హెలికాప్టర్ నుంచి కిందికి దూకేస్తారు. ఇలాంటి ఏ విన్యాసం చేసినా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే.
Viral Video : సరదాగా ఊగే ఊయలే ప్రాణాలు తీయబోయింది
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిజం చెప్పాలంటే అది షాకింగ్ వీడియో. ఇద్దరు యువతులు సరదాగా ఊగిన ఊయల.. పెద్ద ట్రాజెడీ మిగిల్చింది. 6000 అడుగుల లోయ పక్కనే ఓ ఊయలను ఏర్పాటు చేశారు. టూరిస్టులను ఆకట్టుకోవడం కోసం అక్కడ ఈ ఊయలను ఏర్పాటు చేశారు.
ఇంతలో ఇద్దరు యువతులు వచ్చి ఆ ఊయల మీద కూర్చున్నారు. వారిని నిర్వాహకులు వెనుక నుంచి ఊయలను నెట్టి ఊపడం ప్రారంభించారు. కొన్ని రౌండ్లు తిరిగాక.. ఇంతలో ఊయల గొలుసు తెగిపోయింది. దీంతో ఇద్దరు యువతులు లోయలో పడిపోయారు.
ఈ ఘటనను చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఇద్దరు యువతులు ఎక్కడ పడిపోయారా అని అందరూ షాక్ అయ్యారు. వెంటనే అక్కడి సిబ్బంది వాళ్లను కాపాడేందుకు లోయలోకి దిగుతారు. లోయలో పడిపోయిన ఆ ఇద్దరు యువతులను రక్షిస్తారు. వాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి ఆ ఇద్దరు యువతులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన రష్యాలోని డాగేస్తాన్ లో చోటు చేసుకుంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. ఇలాంటి ఘటనను ఎక్కడా చూడలేదు. అయినా లోయ పక్కన ఊయల పెట్టడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.