Viral Video : సోషల్ మీడియాలో పొద్దున లేస్తే వేల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. అందులో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఆ రోజంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నిజానికి ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. కానీ.. అక్కడి పరిస్థితి చూసి మనం నవ్వుకునే వీడియో అయితే ఇది కాదు. అయినా కూడా ఈ వీడియోను చూస్తే నవ్వు మాత్రం ఆగదు. నవ్వలేక చావాల్సిందే. అయ్యో.. ఏందిది అంటూ నవ్వుకోవడం తప్పితే చేసేదేం ఉండదు.
Viral Video : ఎస్కలేటర్ ఎక్కబోయి బొక్కబొర్లా పడ్డ యువతులు
చాలామందికి ఎస్కలేటర్ ఎక్కాలంటే భయం. ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు సిటీకి వెళ్తే.. ఎక్కడైనా ఎస్కలేటర్ ఉన్నా.. లిఫ్ట్ ఉన్నా ఎక్కడానికే భయపడుతుంటారు. దానికి కారణం.. ఎస్కలేటర్ ఎక్కి ఎలా పైకి వెళ్లాలో వాళ్లకు తెలియకపోవడం. అందుకే.. ఎస్కలేటర్ ఎక్కేందుకు భయపడుతూ ఉంటారు. అలా ఓ ఇద్దరు యువతులు ఎస్కలేటర్ భయం భయంగానే ఎక్కుతూ స్లిప్ అయిపోయి కిందపడ్డారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు ఎస్కలేటర్ ఎక్కబోయి బొక్కబోర్లా కింద పడటంతో వెనుక ఉన్న వాళ్లు వాళ్లను కాపాడారు. అయితే.. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అవడంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. వీడియోను వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram