Viral Video : ట్రెండింగ్ లో అర్జున్ రెడ్డి డిలీటెడ్ సీన్.. లైగర్ రిలీజ్ రోజే ఈ వీడియోను ఎందుకు రిలీజ్ చేశారు?

Viral Video : ప్రపంచవ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుంచి లైగర్ సినిమా గురించే చర్చ. లైగర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మిక్స్ డ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే. కొందరు సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్, యాక్టింగ్ అదుర్స్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో తనను మాస్ హీరోను చేసిన అర్జున్ రెడ్డి సినిమా నుంచి డిలీట్ చేసిన ఓ వీడియోను మూవీ యూనిట్ యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.

Advertisement
vijay deverakonda arjun reddy deleted scene viral
vijay deverakonda arjun reddy deleted scene viral

అప్పటి వరకు క్లాస్ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి సినిమా మాస్ హీరోను చేసింది. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో స్థానానికి చేరుకున్నాడు. సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు ఇండియా మొత్తం ఫ్యాన్స్ అయ్యారు. ముఖ్యంగా యూత్.. విజయ్ కు అడిక్ట్ అయిపోయారు. ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదు అని చెప్పడానికి ఈ సినిమాకు సంబంధించిన డిలీటెడ్ సీనే సాక్ష్యం.

Advertisement

Viral Video : తెలుగు ఇండస్ట్రీలో మూస ధోరణికి స్వస్తి పలికి అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమా రొటీన్ రొడ్డుకొట్టుడు సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. సరికొత్త లవ్ స్టోరీతో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది. దేశమంతా ఆ సినిమా గురించే మాట్లాడుకుంది. అయితే.. నిన్ననే అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఆ సినిమా రిలీజ్ అయిన రోజే అర్జున్ రెడ్డి సినిమాలోని డిలీటెడ్ సీన్ ను పోస్ట్ చేసింది మూవీ యూనిట్. అర్జున్ రెడ్డి, తన ఫ్రెండ్ మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన సీన్ అది. ఇద్దరూ మందు కొడుతూ మాట్లాడుకున్న సీన్ ను ఎందుకు డిలీట్ చేశారు అర్జున్ రెడ్డి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అర్జున్ రెడ్డిని గుర్తు చేసినందుకు అర్జున్ రెడ్డి మూవీ యూనిట్ కు ధన్యవాదాలు చెబుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Advertisement