Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి ఒక సెక్యూరిటీ గార్డును చితకబాదుతుంది. చాలా పొడవైన ఒక కర్రను తీసుకొచ్చి ఆ యువతి.. సెక్యూరిటీ గార్డును ఆ కర్రతో చితకబాదుతుంది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు కుయ్యో ముర్రో అంటాడు. అసలు ఆ సెక్యూరిటీ గార్డును ఆ యువతి ఎందుకు కొట్టింది.. ఆ వీడియో ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోందో తెలుసుకుందాం రండి.

చాలామంది మూగ జీవాలపై ప్రేమ చూపిస్తుంటారు. దానికి కారణం.. వాటికి ఉండటానికి షెల్టర్ ఉండదు. తినడానికి సరిగ్గా తిండి దొరకదు. ముఖ్యంగా వీధి కుక్కలు అయితే తినడానికి తిండి దొరక్క చాలా బాధపడుతుంటాయి. అటువంటి వాటికి చాలామంది ఆహారం కూడా అందిస్తుంటారు.
అయితే.. ఆ సెక్యూరిటీ గార్డు మాత్రం కుక్కలపై క్రూరంగా ప్రవర్తించాడు. కుక్కలపై క్రూరంగా ప్రవర్తించిన ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న ఓ యువతి అతడి దగ్గరికి వెళ్లి ఓ కర్రతో చితకబాదుతుంది.
Viral Video : తాను ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పినా వినని యువతి
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతు హక్కుల కార్యకర్తగా చెప్పుకున్న ఆ యువతి.. ఆగ్రహంతో ఊగిపోతూ వీధి శునకాలపై క్రూరంగా ప్రవర్తించిన ఆ సెక్యూరిటీ గార్డుని చితకబాదుతూ అతడిపై తిట్ల వర్షం కురిపిస్తుంది.
Shocking video from UP's #Agra! Woman thrashes, abuses society security guard over 'bad behavior' with dogs. pic.twitter.com/XrDSIbT43V
— Aman Dwivedi (@amandwivedi48) August 14, 2022
మరో యువతి వీడియో తీస్తుండగా ఈ యువతి అతడిపై విరుచుకుపడింది. కర్రతో బాదింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు పోలీసులకు చేరడంతో సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెటిజన్లు మాత్రం ఆ యువతి చేసిన పనిని మెచ్చుకోవడం లేదు. తనపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాధితుడు సెక్యూరిటీ గార్డు అఖిలేశ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.