Viral Video : కింగ్ కోబ్రా తలపై కాలు పెట్టిన పిల్లాడు.. బుసలు కొడుతూ విష సర్పం ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెడతారు

Viral Video : అసలే వానాకాలం. వర్షాలకు భూమి లోపల పడుకొని ఉన్న విష కీటకాలు, తేళ్లు, పాములు బయటికి వచ్చేస్తాయి. అడవుల నుంచి ఊళ్లలోకి వస్తుంటాయి. వాటి వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. కొన్ని విష సర్పాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూడకుండా వాటిపై కాలేసినా.. అవి మనల్ని తాకినా ప్రమాదం మనకే. అడవుల్లోనే పాములు, తేళ్లు ఉంటాయి కదా.. ఇండ్ల దగ్గరికి ఎందుకు వస్తాయి అని ఏమరపాటుగా ఉండొద్దు. అలా ఉంటే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

Advertisement
woman saves son from cobra in karnataka video viral
woman saves son from cobra in karnataka video viral

పాముల్లో అత్యంత విషపూరితమైన పాములు అంటే నాగుపాములు అని చెప్పుకోవచ్చు. పెద్ద నాగుపాము దాన్నే కింగ్ కోబ్రా అంటారు. ఆ కింగ్ కోబ్రా ఓ చోట హల్ చల్ సృష్టించింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Viral Video : క్షణాల్లో బాలుడిని కోబ్రా బారి నుంచి కాపాడిన తల్లి

ఓ తల్లి తన కొడుకును స్కూల్ కు పంపించేందుకు బయటికి వస్తుంది. ఇంతలో ఓ పెద్ద నాగుపాము అక్కడ పాకుతూ వెళ్తూ ఉంటుంది. మెట్ల నుంచి కిందికి దిగిన బాలుడు.. అక్కడ పాకుతూ వెళ్తున్న పామును చూసుకోడు. దాన్ని చూసుకోకుండా దాని మీద కాలేయబోతాడు కానీ.. ఇంతలో పాము దాని తలను అటువైపు తిప్పేస్తుంది. తలను వెనక్కి తిప్పి వెంటనే బుసలు కొడుతూ పగడ విప్పిన ఆ పాము బాలుడిని కాటేయబోతుంది.

వెంటనే పామును గమనించిన ఆ పిల్లాడి తల్లి బాలుడిని చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి దూరం పరుగెడుతుంది. ఆ తల్లి ఏమాత్రం ఆలస్యం చేసినా.. ఒక్క క్షణం లేట్ అయినా ఆ పిల్లాడిని ఆ కోబ్రా కాటు వేసేదే. క్షణాల్లో ఆ బాలుడు మృత్యుంజయుడయ్యాడు. ఆ ఘటన ఆ ఇంటి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో.. క్షణాల్లో ఆ బాలుడి ప్రాణాలను ఆ తల్లి ఎలా కాపాడింది. ఎంత చాకచక్యంగా వ్యవహరించింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement