Viral Video : ఏనుగు అనగానే.. ఏనుగు మీద స్వారీ అనగానే మనకు గుర్తొచ్చేది బాహుబలి సినిమానే. అవును.. ఏనుగు మీదికెక్కి ప్రభాస్ చేసిన విన్యాసం మామూలుగా ఉండదు. అప్పట్లో ఏనుగు మీద ప్రభాస్ చేసిన స్వారీని చాలామంది అనుకరించాలని చూశారు. ఏనుగు తోండాన్ని పట్టుకొని ప్రభాస్ దాని మీదికి ఎక్కి కూర్చొంటాడు. ఆ సీన్ వెండి తెర మీద చూడటానికి భలేగా ఉంటుంది.

అయితే.. అదంతా వీఎఫ్ఎక్స్ మహిమ. నిజంగా అలా చేయాలంటే ఎక్స్ పర్ట్స్ కే సాధ్యం అవుతుంది. అలా ఏనుగు తొండం పట్టుకొని సింపుల్ గా దాని మీదికి ఎక్కడం సాధ్యం కాదు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే కింద పడి కాళ్లు విరగ్గొట్టుకోవడం ఖాయం.
Viral Video : ఏనుగు తొండాన్ని పట్టుకొని సవారీ చేయబోయిన మహిళ
ప్రభాస్ బాహుబలి సినిమా అప్పుడే చూసిందో ఏమో.. ఓ మహిళ మాత్రం ఏనుగు మీదికి ఎక్కి సవారీ చేయాలనుకుంది. కానీ.. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. నీళ్లలో ఉన్న ఏనుగు దగ్గరికి వెళ్లి ఏనుగు తొండంపైకి ఎక్కబోయింది. తొండంపైకి ఎక్కనైతే ఎక్కింది కానీ.. నా తొండం మీదికే ఎక్కుతావా అని ఏనుగు ఒక్కసారిగా జూలు విదిలించింది. దీంతో ఏనుగు దెబ్బకు ఆ మహిళ ఎగిరి అంత దూరం నీళ్లలో పడింది.
AWW ELEPHANT!! pic.twitter.com/BkE75hD4PT
— LOCKERROOM (@LockerRoomLOL) August 24, 2022
నిజానికి ఆ ఏనుగు నీళ్లలో ఉంది కాబట్టి ఆ మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ… ఒకవేళ భూమి మీద అయితే ఆ మహిళకు నిజంగానే కాళ్లు చేతులు విరిగేవి. అందుకే.. ఇలాంటి స్టంట్స్ చేసేముందు ముందూ వెనుక చూసుకోవాలని అంటుంటారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో.. ఏనుగుతోనే స్టంట్సా.. ఎందుకు అవసరమా.. కాళ్లు విరగ్గొట్టుకోవడానికి కాకపోతే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.