Viral Video : పెళ్లి చేసుకో అంటూ రోడ్డు మీద ఓ యువకుడి వెంట పడ్డ యువతి.. బిత్తరపోయిన స్థానికులు

Viral Video : సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వేల కొద్ది వీడియోలు షేర్ అయితే అందులో వైరల్ అయ్యేవి కొన్నే. ఆ వీడియోల్లో మంచి సమాచారం ఏదైనా ఉండాలి లేదంటే ఏదైనా మెసేజ్ ఉండాలి.. అప్పుడే జనాలు ఆ వీడియోను చూస్తారు. వైరల్ చేస్తారు. తాజాగా అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. ఈ ఘటన బీహార్ లోని నవాడాలో చోటు చేసుకుంది.

Advertisement
young girl runs after man to marry her in bihar video viral
young girl runs after man to marry her in bihar video viral

ఓ యువతి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడి వెంట పడింది. వెంట పడటం మాత్రమే కాదు.. ఆ యువకుడి వెంట పరిగెత్తింది కూడా. ఆ యువతి వెంట తన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అక్కడి స్థానికులు షాక్ అవ్వాల్సి వచ్చింది. ఆ యువతి నుంచి తప్పించుకునేందుకు అతడు ఎంత ప్రయత్నించినా కుదరలేదు.

Advertisement

Viral Video : ఆ యువతికి, ఆ వ్యక్తికి మూడు నెలల కిందే వివాహం నిశ్చయం

అయితే.. మూడు నెలల కిందే ఆ యువతి, యువకుడికి పెళ్లి నిశ్చయం అయిందట. వివాహ నిశ్చయ సమయంలో బైక్ తో పాటు రూ.50 వేలు కట్నంగా ఇచ్చారట. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. చివరకు పెళ్లి తేదీ దగ్గర పడటంతో పెళ్లిని వాయిదా వేయాలని ఆ యువకుడు కోరాడట. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నాడట ఆ యువకుడు.

ఏదో ఇక సాకు చెబుతూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తుండటంతో యువతికి, ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదట. ఒకరోజు యువతి, ఆమె తల్లిదండ్రులు మార్కెట్ కు వెళ్లగా.. అక్కడ ఆ యువకుడు కనిపించాడు. అతడి దగ్గరికి వెళ్లిన ఆ యువతి పెళ్లి గురించి నిలదీయగా అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు ఆ యువతి కూడా పరుగు స్టార్ట్ చేసింది.

యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా అతడిని పట్టుకోవడం పరిగెత్తారు. ఈ ఘటనను చూసి అక్కడి స్థానికులు బిత్తరపోయారు. చివరకు ఆ యవకుడిని పట్టుకొని మార్కెట్ లోనే అందరి ముందు నిలదీశారు. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆ యువకుడిని ఆ యువతి నిలదీసింది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువతిని, తన తల్లిదండ్రులను, యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరకు ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నారు కానీ.. మార్కెట్ లో అతడిని పట్టుకోవడం కోసం పరిగెత్తిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.. తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement